చిల్లర మాటలతో జనాలను రెచ్చగొడుతున్నారు
-ప్రధాని ఎవరికి దేవుడు.. మంత్రి కేటీఆర్
టీ మీడియా, ఫిబ్రవరి 28,హనుమకొండ : కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ప్రశ్నించే వారిపై ఈడీ, ఐటీలతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాటికి తాము భయపడేది లేదని చెప్పారు. ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం శోడషపల్లిలో వివిధ అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తెలంగాణకు పట్టిన శని, దరిద్రం ముమ్మాటికి బీజేపీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతూ మతం, కులం పేరుతో రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తామని చెప్పి అదానీ ఆదాయాన్ని 1,300 రెట్లు పెంచారని ఆక్షేపించారు. నల్లధనం ఏమైందని అడిగితే తెల్లమొఖం వేసుకుని తప్పించుకోని తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు. రూ.15 లక్షలు ఖాతాలో జమ చేస్తానని చెప్పి.. అన్నీ ఒకే ఒక్కడి ఖాతాలోకి జమ చేశారని ఆరోపించారు.