పోలింగ్ ప్రశాంతం

పోలింగ్ ప్రశాంతం   

0
TMedia (Telugu News) :

పోలింగ్ ప్రశాంతం                                                                                                            జిల్లా ఎన్నికల అధికారి, డాక్టర్ ప్రియాంక అలహర్షం

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడం పట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మార్చి 16 నుండి, నోటిఫికేషన్ ఏప్రిల్ 18 నాటి నుంచి మే 13 పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల నిర్వహణలో జిల్లా ప్రజల సహాయ, సహకారాలు భాగస్వామ్యం మరువలేనిదని ఆమె పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె అభినందనలు తెలియజేశారు.                                                      ALSOREAD:నేను అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నా

 

తీవ్రవాద ప్రభావిత ప్రాంతమైన మన జిల్లాలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించడం ఎంతో అభినందనీయమని, ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన అధికారులకు, అనధికారులకు, జిల్లా ప్రజలకు, పాత్రికేయులకు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube