జడ్పీటీసీ,సర్పంచ్ లను పరామర్శించిన పొంగులేటి

0
TMedia (Telugu News) :

టీ మీడియా 22 నవంబర్

నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేట మండలంలో సోమవారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన తిరుమల కుంట తెరాస నాయకులు పల్లెల రామలక్ష్మయ్య కూతురు వివాహానికి హాజరై వదువరులను ఆశీర్వదించారు. అనంతరం ఆసుపాక సర్పంచ్ కునుసోతూ లింగయ్య ఇటీవల తీవ్ర అనారోగ్యం తో చికిత్స పొంది కొలుకున్నారు.ఆయన స్వగృహం కి వెళ్లి సర్పంచ్ ఆరోగ్యం పై అరా తీశారు.ఏమి అవసరం ఉన్నా తెలియచేయమని అధైర్య పడవద్దని ధైర్యం చెప్పారు.అనంతరం నారాయణపురం గ్రామంలోని జడ్పీటీసీ చిన్నశెట్టి వరలక్ష్మి అత్తగారైన వెంకమ్మ ఇటీవల మరణించటం తో వారి కుటుంబాన్నీ పరామర్శించారు.వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ, మండల తెరాస రైతు అధ్యక్షులు జూపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Pongleti consults ZPTC , sarpanch
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube