హీరో కృష్ణం రాజు మరణం పట్ల పొంగులేటి సంతాపం

హీరో కృష్ణం రాజు మరణం పట్ల పొంగులేటి సంతాపం

1
TMedia (Telugu News) :

హీరో కృష్ణం రాజు మరణం పట్ల పొంగులేటి సంతాపం

టీ మీడియా,సెప్టెంబర్ 11,ఖమ్మం: ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో, మాజీ కేంద్రమంత్రి శ్రీ కృష్ణంరాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం సంతాపం ప్రకటించారు. తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి తన విలక్షణ నటనాశైలితో రెబల్ స్టార్ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం తెలుగు వెండితెరకు తీరని లోటని పొంగులేటి పేర్కొన్నారు.

Also Read : కృష్ణం రాజు మరణంపట్ల కేసీఆర్ సంతాపం

లోక్ సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, రాజకీయ పాలనా రంగం ద్వారా దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని పొంగులేటి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు పొంగులేటి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube