ఆలయాల అభివృద్ధికి పొంగులేటి ఆర్థికసాయం

టేకులగూడెం రామాలయానికి రూ. 50వేలు

1
TMedia (Telugu News) :

ఆలయాల అభివృద్ధికి పొంగులేటి ఆర్థికసాయం
-టేకులగూడెం రామాలయానికి రూ. 50వేలు
– సుద్దవాగుతండా ఆంజనేయస్వామి ఆలయానికి రూ. 50వేలు
టి మీడియా, జూన్ 26,ఖమ్మం: ఆలయాల అభివృద్దికి తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన వంతు ఆర్థికసాయలను అందజేస్తు వస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కారేపల్లి మండలంలోని టేకులగూడెం రామాలయానికి రూ. 50వేలను, తిరుమలాయపాలెం మండలంలోని ఆంజనేయస్వామి దేవాలయానికి రూ. 50వేలను విరాళంగా అందజేశారు. -పొంగులేటికి మధిర మన్జీద్ అభివృద్ధి కమిటీ వినతి… మధిర మండలానికి చెందిన మధిర మన్జీద్ అభివృద్ధి కమిటీ నాయకులు ఆదివారం మాజీ ఎంపీ పొంగులేటిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. మన్జీద్ అభివృద్ధికి సహకరం అందించాలని వినతి పత్రం సమర్పించారు. తప్పకుండా తనవంతు సహకరం అందజేస్తానని ఈ సందర్భంగా పొంగులేటి వారికి హామీ ఇచ్చారు. వినతిపత్రం సమర్పించిన వారిలో ఎస్ కె. ముజాహిద్, ఎడీ. ఖాళీం, ఇస్మాయిల్ తదితరులు ఉన్నారు.

Also Read : బీసీ ఓవర్సీస్’కు కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన

కొణిజర్లలో పర్యటించిన మాజీ ఎంపీ పొంగులేటి కొణిజర్ల : తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం కొణిజర్ల మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా లింగగూడెం గ్రామ మాజీ సర్పంచ్ జడ నర్సయ్య భార్య చనిపోయినందున వారి కుటుంబాన్ని పరామర్శించారు. గోపవరంలో గుర్రం రామకృష్ణాకి ఇటీవల శస్త్ర చికిత్స జరగ్గా అతన్ని పరామర్శించారు. అదేవిధంగా పెద్ద మునగాలలో పలు కుటుంబాలను పరామర్శించారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గుమ్మా రోశయ్య, జిల్లా నాయకులు కోసూరి శ్రీనివాసరావు, పొట్లపల్లి శేషగిరి, రాయల పుల్లయ్య, సుడా డైరెక్టర్ బండారు కృష్ణ, సర్పంచ్లు మూడు సురేష్, పరికపల్లి శ్రీను, అద్దంకి చిరంజీవి, గుగులోతు నర్సింహా, రంగు సత్యనారాయణ, షేక్ అబ్జల్ బీ, అమడపూడి సిల్వమ్మ, ఎంపీటీసీలు ఇంజం విజయ, గుండ్ల కోటేశ్వరరావు, బుర్రా ప్రసాద్, తేజావత్ కుమారి, అంబేడ్కర్, మండల నాయకులు ఇంజం పిచ్చయ్య, కురవి వెంకటప్పయ్య, చల్లగుండ్ల సురేష్, ధారవత్ బాబులాల్, కొలిపాక వెంకటేశ్వర్లు, షేక్ దాదా సాహెబ్, గడల నరేందర్ నాయుడు, కొనకంచి మోషే, కన్నగంటి రావు, రచ్చా రామకోటయ్య, దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, మద్దిన్ని ఆదినారాయణ, నల్లమోతు లక్ష్మయ్య, ఇంజం వెంకటేశ్వర్లు, యలమందుల మధు, లకావత్ దేవేందర్, షేక్ జానీ పాషా, తేజావత్ మదన్, కావూరి శ్రీను, దారగాని శ్రీను, యేసు, చింతల యల్లయ్య, మూల నాగేశ్వరరావు, షేక్ ఖాదర్, రాయల నర్సింహారావు, నిఖిల్, సోలా శ్రీను, దాసరి వీరబాబు, సంతోషాం, కాంపెల్లి నగేష్, రామారావు తదితరులు ఉన్నారు.

Also Read : చెక్ డ్యాం ల నిర్మాణంలోకాంట్రాక్టర్ల మాయ

వైరాలో పర్యటించిన మాజీ ఎంపీ పొంగులేటి వైరా: తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం వైరా మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా విప్పలమడక గ్రామంలో కొండపనేని రమేష్ ఇంట్లో జరిగిన ఉప్పలమ్మ వేడుకలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైరా జడ్ పీటీసీ నంబూరి కనకదుర్గ, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గుమ్మా రోశయ్య, కోసూరి శ్రీనివాసరావు, మిట్టపల్లి నాగి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ద్నా శేఖర్, షేక్ రహీమ్, పనితి సైదులు, మచ్చా రామారావు, రేచర్ల సత్యం, జాలాది రామకృష్ణ, కాంపాటి శేషగిరి, పొట్లపల్లి శేషగిరి, రాయల పుల్లయ్య, సుడా డైరెక్టర్ బండారు కృష్ణ, తదితరులు ఉన్నారు.

Also Read : కొల్లాపూర్‌లో టెన్షన్‌.. టెన్షన్‌..

పలు మండలాల్లో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన
ఖమ్మం: తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం తల్లాడ, ఖమ్మం, ఖమ్మం రూరల్, కారేపల్లి, ఇల్లందు మండలాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయా మండలాల్లో జరిగిన వివాహాది శుభకార్యలలో పాల్గొన్నారు. ఇటీవల చనిపోయిన పలువురు వ్యక్తుల కుటుంబాలను పరామర్శించారు. వివిధ ప్రమాదాల్లో గాయడిన బాధితులను ఓదార్చారు. ఆర్థికసాయాలను అందజేశారు. ఇతర ప్రయివేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఫోటోలు :- 001) ఖమ్మం- విరాళంను అందజేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి
002) కొణిజర్ల- వృద్దుడిని పరామర్శిస్తున్న పొంగులేటి
003) వైరా- ఉప్పలమ్మ వేడుకలో పాల్గొన్న పొంగులేటి
004) ఖమ్మం- వివాహం సందర్భంగా పెళ్లి జంటను దీవిస్తున్న మాజీ ఎంపీ
005) రూరల్- చిన్నారులకు పొంగులేటి ఆశీర్వాదం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube