ఇఫ్తార్ విందులో మాజీ ఎంపీ పొంగులేటి

ఇఫ్తార్ విందులో మాజీ ఎంపీ పొంగులేటి

1
TMedia (Telugu News) :

ఇఫ్తార్ విందులో మాజీ ఎంపీ పొంగులేటి

టీ మీడియా, ఏప్రిల్23, తిరుమలాయపాలెం: తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఖమ్మంజిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా తిరుమలాయపాలెం మండలంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. దమ్మాయిగూడెంలో ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. విందుకు హాజరైన ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో వర్ధిలాల్లని ఆకాంక్షించారు. అనంతరం ఉపవాస దీక్ష ముగించిన ముస్లిం సోదరులకు ఖజ్జూర తినిపించారు. అదేవిధంగా మండలంలోని రాజారం, ముజాహిద్ పురం, సుద్దవాగుతండా, కాకరవాయి గ్రామాల్లో పర్యటించారు. పలు శుభకార్యక్రమాలకు హాజరైయ్యారు. వివిధ కారణాలతో మృతిచెందిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శించారు.

also read ; దివ్యాంగుల కి దుప్పట్లు పంపిణీ చేసిన ఐ.పీ.ఎస్ అధికారి గౌష్ అలమ్

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులను ఓదార్చి ఆర్థికసాయాలను అందజేశారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట రామ సహాయం నరేష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ చావా శివరామకృష్ణ, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బత్తుల రవి, కొక్కిరేణి వైస్ ఛైర్మన్ సిహెచ్. ఉపేందర్, మండల కో ఆప్షన్ మెంబర్ సైప్పుద్దిన్, కాకి వెంకటరెడ్డి, సొసైటీ డైరెక్టర్, లింగయ్య, నాగయ్య, కాకరవాయి మాజీ సర్పంచ్ యల్లయ్య, చామకూరి ఉ పేందర్, చామకూరి సురేందర్, తాళ్లచెర్వు ఎంపీటీసీ చుంచు వెంకటేశ్వర్లు, మైనార్టీ మండల అధ్యక్షులు బాషామియా, చామా శ్రీనివాసరెడ్డి, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, నగర కార్పొరేటర్ దొడ్డా నగేష్, అయీలూరి వెంకటేశ్వరరెడ్డి, ఎర్రుపాలెం మండలం రైతు సమన్వయ కమిటీ మాజీ అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube