పదవీ భాద్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి

పదవీ భాద్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి

0
TMedia (Telugu News) :

పదవీ భాద్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి

టి మీడియా, డిసెంబర్ 14, హైద్రాబాద్ : రాష్ట్ర సమాచార, రెవిన్యూ, గృహనిర్మాణ శాఖా మంత్రిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భాద్యతలు స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రిని ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, వేముల వీరేశం, ఆదినారాయణ, బాలు నాయక్, ఆది శ్రీనివాస్, యశస్వినీ రెడ్డి తోపాటు పలువురు సీనియర్ నాయకులు రేణుకా చౌదరి, రామసహాయం సురేందర్ రెడ్డి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్ అండ్ బీ కార్యదర్శి శ్రీనివాస రాజు, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ కె. అశోక్ రెడ్డి, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య, జేడీ లు జగన్, శ్రీనివాస్, వెంకట రమణ, డీడీ లు మధు సూధన్, హాష్మి, రాజా రెడ్డి, సీఐఈ రాధా కిషన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు.

Also Read : నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూపులు..

భువనగిరిలో స్పోర్ట్ కాంప్లెక్స్ కు 10 ఎకరాల భూమి

భువనగిరి జిల్లా రాయగిరి లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి పది ఎకరాల భూమిని కేటాయిస్తూ తన మొదటి ఫెయిల్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంతకం చేశారు. రూ. 9 .50 కోట్ల విలువ గల ఈ పదెకరాల స్థలాన్ని మల్టి పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి చేపట్టేందుకు యువజన, క్రీడల శాఖ కు కేటాయించారు.

33 జిల్లాల డీపిఆర్ఓ లకు అధునాతన కెమెరాలు
రాష్ట్రంలోని 33 జిల్లాల డీపిఆర్ఓ లకు అధునాతన కెమెరాలు అందచేసే సమాచార, పౌర సంబంధాల శాఖ కు చెందిన ఫైల్ పై మంత్రి పొంగులేటి సంతకం చేశారు. గృహ నిర్మాణ శాఖ కు చెందిన పలు పరిపాలనా సంబంధిత ఫైళ్లపై సంతకం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube