దమ్మపేటలో పొంగులేటి పర్యటన

పలకరిస్తూ... భరోసానిస్తూ సాగిన మాజీ ఎంపీ

1
TMedia (Telugu News) :

దమ్మపేటలో పొంగులేటి పర్యటన
పలకరిస్తూ… భరోసానిస్తూ సాగిన మాజీ ఎంపీ
టీ మీడియా , జూన్ 25,దమ్మపేట: మంచికాలం సమీపించే గడియలు ఆనన్నమయ్యాయని… రాబోయే రోజులన్ని మనవేనని… ఏఒక్క అక్క… చెల్లి… అన్న… తమ్ముడు అధైర్యపడొద్దని… ప్రతిఒక్కరికి అండగా ఉంటానని హామీ ఇస్తూ.. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ… బాధిత కుటుంబాలకు నేనున్నా మీ శీనన్నననే భరోసానిస్తూ దమ్మపేట మండలంలో తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం పర్యటించారు.

Also Read : ద్రౌపది ముర్ముపై కూతురు ఆసక్తికర వ్యాఖ్యలు

పర్యటన లో భాగంగా నాగవల్లి, నాచారం, తొట్టిపంపు, గణేష్పాడు, మందలపల్లి, రంగువారిగూడెం, పాతచీపురుగూడెం తదితర గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాల్లోని పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. పలు వివాహాది శుభకార్యక్రమాల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. పట్టువస్త్రాలను కానుకగా సమర్పించారు. ఇటీవల చనిపోయిన పలువురు వ్యక్తుల కుటుంబాలను పరామర్శించారు. వివిధ ప్రమాదాల్లో గాయపడిన వ్యక్తులను పరామర్శించి ప్రస్తుతం వారి ఆరోగ్యస్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వీటితో పాటు ఇతర ప్రయివేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube