మాజీ ఎంపి పొంగులేటి విస్తృత పర్యటన

మాజీ ఎంపి పొంగులేటి విస్తృత పర్యటన

1
TMedia (Telugu News) :

మాజీ ఎంపి పొంగులేటి విస్తృత పర్యటన

టీ మీడియా, ఎప్రియల్ 12,అశ్వారావుపేట: తెరాస రాష్ట్రనాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా చండ్రుగొండ మండలంలోని పోకలగూడెం, గానుగపాడు, బెండాలపాడు, గుర్రాయిగూడెం, అయ్యన్నపాలెం, దామరచర్ల, సీతాయిగూడెం గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన పలువురు వ్యక్తుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థికసాయాలను అందజేశారు. అదేవిధంగా వివిధ ప్రమాదాల్లో గాయపడిన వారిని ఓదార్చారు. పలు శుభాకార్యక్రమాలకు హాజరై నూతన వస్త్రాలను బహుకరించారు.

Also Read : అనాధలకి చేయూత

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube