పాలేరు పై పొంగులేటి దృష్టి
– వియ్యంకుడు కు టికెట్ కోసం యత్నం
– చేగొమ్మ అందుకోసమే నా..?
– నేడు రూరల్ ఫంక్షన్ హాల్లో సమావేశం
– జిల్లా కాంగ్రెస్ నేతల హాజరు కష్టం
టీ మీడియా,ఆగస్ట్ 7,రాజకీయ ప్రతినిధి: ముఖ్యమంత్రి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి,బండి సంజయ్ లాగా కాంగ్రెస్ లో చేరక ముందే విమర్శలు చేసి ప్రత్యేకత గాఉమ్మడి జిల్లాలో నిలిచిన టి పి సీసీ ప్రచార కార్యదర్శి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎక్కడ నుండి పోటీ అనేది ఇంకా స్పష్టత రాలేదు. పార్టీ లో చేరిన అనంతరం కాంగ్రెస్ లో తనకంటూ ప్రత్యేక గ్రూప్ ను కొనసాగిస్తున్నారు.క్యాంపు కార్యాలయం కేంద్రం గానే కార్య కలా పాలు నిర్వహిస్తూ,సొంత నెట్ వర్క్ తో కార్పొరేట్ స్థాయి లో పని చేస్తున్న అయన, తాజాగా పాలేరు నియోజిక వర్గం పై దృష్టి పెట్టటం చర్చ నీ యాంసం గా మారింది. ఇప్పటి వరకు రాయల నాగేశ్వరావు కాంగ్రెస్ నుండి బరిలో పాలేరు నుండి ఉండేది అని ప్రచారం జరిగింది.అయన కూడా అదే స్థాయిలో నీయోజి క వర్గం లో పర్యటన లు చేశారు.అయన పర్యటనకు బ్రేక్ వేస్తూ అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.
also read :పాలేరు గడ్డ పై బహుజన రాజ్యం స్థాపిస్తాం.
నేడు సమావేశం
పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంగళ వారం ఖమ్మం రూరల్ మండలం లోని ఫంక్షన్ హాలులో చేరికలు పేరుతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇతర నేతలు హాజరు అనుమానం గా ఉంది.సోమవారం కూసుమంచి మండలం పర్యటన లోనూ జిల్లా నాయకత్వం కనిపించ లేదు..
చేగొమ్మ అందుకొసమానా..
మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు తండ్రి సురేందర్ రెడ్డి ది ఆసలు కూసుమంచి మండలం చెగొమ్మ గ్రామం.వారి దొర గడి నేటికీ ఉంది. అక్కడి రెవిన్యూ రికార్డ్ ల్లోనూ రాం సహాయం రాఘవ రెడ్డి, మాజీ ఎంపి సురేందర్ రెడ్డి పట్టాలు పేరున భూములు ఉన్నయి.వారిని దొర గా నేటికీ పిలుస్తారు..మాజీ ఎంపి సురేందర్ రెడ్డి రఘురామరెడ్డి పొంగులేటి కి వియ్యంకుడు.బంగ్లా కు మార్చి అక్కడ ఇల్లు ఉన్న వీరు హైద్రాబాద్ లో ఉంటున్నారు. పాలేరు నియో జిక వర్గం లో కాంగ్రెస్ కి పట్టు ఉన్న మండలాల్లో తీర్ములాయ పాలెం,కూసుమంచి ఉన్నయి.నెల కొండపల్లి ,ఖమ్మం రూరల్ లో రెడ్డి సామాజిక వర్గం కొన్ని గ్రామాల్లో పట్టు ఉంది. మాజీ ఎంపి సురేందర్ రెడ్డి కుటుంబ ప్రభావం ఉంది.ఈ నేపథ్యంలో తన వియ్యంకుడు ను పాలేరు కాంగ్రెస్ నుండి పోటీ చేయించాలి అనే సంకల్పం తో చేగొమ్మ పొంగులేటి పర్యటన గా తెలుస్తోంది.అక్కడ బి అర్ ఎస్ ,కాంగ్రెస్ మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గు మనే పరిస్థితి ఉంది.
నరేష్ రెడ్డి బి అర్ ఎస్ లోనే
ఇది ఇలా ఉంటే ..బి ఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి , సి ఎం కేసీఆర్ సన్ని హితుడు లో ఓక రైన నూకల నరేష్ రెడ్డి మాజీ ఎంపి సురేందర్ రెడ్డి కి అల్లుడు,పొంగులేటి వియ్యంకుడు కి స్వయాన భావ.ఈయన గత అన్ని ఎన్నిక ల్లో బి అర్ ఎస్ ఖమ్మం జిల్లా ఇంఛార్జి ల్లో ఓకరు గా ఉన్నరు.ఎంపి గా నామ నాగేశ్వర రావు పోటీ చేసి నప్పుడు నరేష్ రెడ్డి ఇంఛార్జి గా ఉన్నరు.ఇంకా అయన బి అర్ ఎస్ లోనే ఉన్నరు.
రాయల పరిస్థితి
రఘురాం రెడ్డి రంగం లోకి వస్తె రాయల నాగేశ్వర రావు పరిస్థితి ఎంటి ఆన్న చర్చ జరుగుతోంది.ఖమ్మం టికెట్ చూద్దాం అని సర్ది చెప్పినట్లు గా తెలుస్తోంది. ఖమ్మం నియోజిక వర్గం లో ఇప్పటి కే పొంగులేటి సొంత నెట్ వర్క్ ఏర్పాటు చేసు కొనే పని లో ఉన్నరు.ఇక్కడ నుండి పోటీ ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.ఇటీవల కొత్త గూడెం లో పొంగులేటి పర్యటన పేలవంగా ఉండటం తో అక్కడ వద్దు,ఇక్కడ ముద్దు ఆన్న నిర్ణయం చేసుకొన్నట్లు గా తెలుస్తోంది.మొత్తం మీద జిల్లా కాంగ్రెస్ లో పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకంపన లు ఆరంభం అయ్యాయి అనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం గా ఉంది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube