పదవీ బాధ్యతలు స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌

పదవీ బాధ్యతలు స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌

0
TMedia (Telugu News) :

పదవీ బాధ్యతలు స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌

టీ మీడియా, డిసెంబరు 18, హైదరాబాద్‌ : డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయం)లో సోమవారం రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన టీఎస్‌ఆర్టీసీ, రవాణా శాఖకు సంబంధించిన మూడు ఫైళ్లపై సంతకం చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికానికి బస్‌పాస్‌లకు రాయితీల ఖర్చు రీయింబర్స్‌మెంట్ కోసం 212.50 కోట్లను విడుదల చేస్తూ ఒక ఫైలుపై సంతకం చేశారు. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికానికి గాను 162.50 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ మరొక ఫైలుపై, ఎల్‌. రాజ్య లక్ష్మి, హెడ్ ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్‌కి ఒక లక్ష రూపాయలు మెడికల్ క్లెయిమ్‌ మంజూరు చేస్తూ మూడో ఫైల్‌పై సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వివేక్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు బుర్రా వెంకటేశం, వాణీప్రసాద్‌, టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్‌ తదితరులు అభినందించారు.

Also Read : మంత్రి తుమ్మల అధికారిక క్యాంపు ఆఫీస్ రెడీ

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube