టీ మీడియా,అక్టోబర్30, మధిర:
మధిర మండలం దెందుకూరు గ్రామంలో సిపిఎం పార్టీ మండల రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణా తరగతులు పార్టీ మండల కార్యదర్శి మందా సైదులు అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ… దేశంలో ప్రజాలందరూ వారి వారి స్థాయిలో దోపిడీకి గురవుతున్నారని వ్యవసాయ కూలీలు రైతులు కార్మికులు కౌలు రైతులు మహిళలు పేద ప్రజలు అందరూ దోపిడీకి గురవుతున్నారని శ్రమకు తగ్గ ఫలితం పొందడం లేదని ఫలితంగా దేశంలో ఒకవైపు పేదరికం విపరీతంగా పెరుగుతుందని మరోవైపు సంపన్నుల ఆస్తులు రోజుకు కోట్ల రూపాయల ఆస్తులు పెరుగుతున్నాయని దేశంలో ఆర్థిక అసమానతలు పెరగడానికి పాలకులు అనుసరిస్తున్న విధానాలే కారణమని అన్నారు.
ప్రజల్లో పెరుగుతున్న పేదరికం నిరుద్యోగం సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించకుండా ప్రజల్లో మత విభజన చేసి ప్రాంతీయ విభజన చేసి ప్రజలకి ప్రజలను శత్రువులుగా చూపించే ప్రయత్నాలను ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా
వర్గ పోరాటాలు ప్రజలను ఐక్యం చేస్తాయని వర్గ పోరాటంతో కమ్యూనిస్టు ఉద్యమం బల పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ చింతలచెరువుకోటేశ్వరరావు, పార్టీ జిల్లా నాయకులు బండి పద్మ,సిఐటియు జిల్లా నాయకులు నరసింహారావు, పార్టీ పట్టణ కార్యదర్శి మండవ ఫణీంద్ర కుమారి, పార్టీ మండల నాయకులు మద్దాల ప్రభాకర్ ఓట్ల శంకర్రావు సంపశాల గోపాలరావు రాయబారపు చిన్న వెంకటేశ్వర్లు అల్లూరు నాగేశ్వరరావు కారుమంచి జోజి తదితరులు పాల్గొన్నారు.