నిరుపేద బ్రాహ్మణులకు ప్రతినెలా ఉచితంగా నిత్యవసర వస్తువులు.

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్,19, భద్రాచలం

భద్రాచలంలోని నిరుపేద బ్రాహ్మణులకు ప్రతి నెలా నిత్యవసర వస్తువులను అందజేసే కార్యక్రమాన్ని కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజున భద్రాచలంలోని సూపర్ బజార్ సెంటర్లోని సాయి బాబా భజన మందిరం లో ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరు పేద బ్రాహ్మణులకు నిత్యవసర వస్తువుల పంపిణీ చేశారు. దీనితోపాటు ఒక్కో కుటుంబానికి రిటైర్డ్ ప్రిన్సిపాల్ చక్రవర్తి కొంత నగదు కూడా అందజేశారు.

అమెరికాలోని రామాయణ పారాయణ సేవాసమితి సహకారంతో ప్రతి నెల రెండవ శనివారం సాయి బాబా భజన మందిరం లో ఈ విచారణ జరుగుతుంది.అందులో భాగంగా జరిగిన కార్యక్రమానికి సీనియర్ పాత్రికేయులు కోలా ఆనంద్ కుమార్ అధ్యక్షత వహించగా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణ మోహన్,రిటైర్డ్ ప్రిన్సిపాల్ చక్రవర్తి,చిన్న జీయర్ మఠం అధ్యక్షులు వెంకటాచారి, ఎస్బిఐ రిటైర్డ్ అధికారి శంకర్రావు,సాయిబాబా భజన మందిరం ఆర్కే రామారావు భద్రాచలం ఆర్టీసీ డిపో సూపరింటెండెంట్ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube