నిరుపేద విద్యార్థిని ఉన్నత చదువులకు

సమతా ఫౌండేషన్ చేయూత

0
TMedia (Telugu News) :

నిరుపేద విద్యార్థిని ఉన్నత చదువులకు
సమతా ఫౌండేషన్ చేయూత

టీ మీడియా,మార్చి 02, గోదావరిఖని :

పక్షవాతం కారణంగా తండ్రి మంచానపడి ఆర్థికంగా ఆదుకునే వారు లేక చదువును మధ్యలో ఆపేయాలని దిగులు పడుతూ మానసికంగా కృంగిపోతున్న సౌందర్య అనే నిరుపేద విద్యార్థినికి తామున్నాననే అభయ హస్తాన్ని సమతా ఫౌండేషన్ అందించింది.ఈ మేరకు బుధవారం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి కి చెందిన నిరుపేద విద్యార్థిని ఓంకారి సౌందర్య కుటుంబాన్ని సమత ఫౌండేషన్ చైర్మన్ దుర్గం నగేష్ తమ ఫౌండేషన్ సభ్యులతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా సౌందర్య అగ్రికల్చర్ బి ఎస్ సి పూర్తి చేయుటకు దాతల సహకారంతో సేకరించిన యాభై ఐదు వేల ఐదు వందల రూపాయల నగదును
అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ… నిరుపేదల కోసం ప్రభుత్వాలు ఉచితంగా విద్య,వైద్యం అందించాలన్నారు.పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు తమ పౌండేషన్ ద్వారా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు.అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సైతం తమ వంతు సహాయం చేస్తున్నట్లు తెలిపారు.సౌందర్య రెండవ టర్మ్ పీజు 32,500 చెల్లించిన వెంకటస్వామి తోపాటు సహాయం అందించిన మంచిర్యాల డి ఎం హెచ్ ఓ,ఎక్సైజ్ సిఐ రమేష్, ఎస్ఐ సాంబమూర్తి, భూపాలపల్లి డిపిఆర్ఓ రవికుమార్, టీచర్ ప్రమీల,గంట చాందిని, సహాయం అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా భవిష్యత్లో సౌందర్యకు చదువుకు అవసరమైన తోడ్పాటును అందిస్తామన్నారు. అనంతరం విద్యార్థిని సౌందర్య మాట్లాడుతూ తాము ముగ్గురం అక్క చెల్లెలమని,నాన్న పక్షవాతంతో మంచాన పడ్డారని,అమ్మ కూలిపనులకు పోతుంటదని,ఆర్థిక పరిస్థితుల్లో మధ్యంతరంగా చదువు ఆపేయాల్సి వస్తుందని చాలా బాధపడ్డాను.ఎలాగైనా చదువుకోవాలని విలేకరి జనగామ తిరుపతి, సహాయంతో సమత ఫౌండేషన్ చైర్మన్ దుర్గం నగేష్ కు నా పరిస్థితి వివరించాను.వారు వెంటనే స్పందించి మనసిక ఓదార్పు నిచ్చి ఎంతో ధైర్యం చెప్పి, నీ చదువు పూర్తయ్యేంతవరకు చేయూత అందిస్తానని చెప్పడంతో ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది.రిటైర్డ్ ఎం ఈ ఓ భూమయ్య,మాట్లాడుతూ..దుర్గం నగేష్,సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారైనప్పటికీ విద్య, వైద్యం మొదలైన విషయాల్లో ఎవరు కూడా బాధ పడకూడదని డాక్టర్ అంబేద్కర్ పే బ్యాక్ టు ద సొసైటీ నినాదంతో సమత ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి సేవలు అందిస్తున్నారని, సమత ఫౌండేషన్ సభ్యులందరూ పది కాలాలపాటు చల్లగా ఉండాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రజిత వెంకటేష్, ఫౌండేషన్ సభ్యులు చందనగిరి ప్రమీల,కుమ్మరి యువరాజు,జిమ్మిడి గోపాల్,గోమాస మురళి కృష్ణ, రాజబాబు,సోదారి నాగరాజు,సౌందర్య తల్లిదండ్రులు లక్ష్మి ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube