పోరుబాణలై మా గిరిజన బలం చూపుతా0.

పోరుబాణలై మా గిరిజన బలం చూపుతా0.

0
TMedia (Telugu News) :

మమ్ము నీటముంచి కడతామంటే పోలవరం డ్యామ్..
పోరుబాణలై మా గిరిజన బలం చూపుతా0.
ముగిసిన పోలవరం పోరుబాట యాత్ర.

టీ.మీడియా..సెప్టెంబర్.24… చింతూరు….

మమ్ము నీట మంచి కడతామంటే పోలవరం డ్యామ్ పోరు బాణాలై మా గిరిజన బలం చూపుతాను అంటూ పోలవరం పోరుబాట యాత్రలో నినాదాలు చేస్తూ ముందుకు నడిచింది.
శనివారం నాలుగో రోజుకు చేరిన పోలవరం పోరుబాట యాత్ర కొమ్మూరు గ్రామం నుండి మొదలుకొని చట్టి ప్రధాన రహదారి గుండా రచ్చబండ కు చేరుకుంది. అక్కడ పోరుయాత్ర బృందానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. మాజీ సర్పంచ్ బ్లాక్ సమితి అధ్యక్షులు తు ర్రం పొడియం దొర సంఘీభావం తెలిపినారు. మహిళలు పోరుయాత్ర బృందానికి ఎదురు వెళ్లి తిలకం దిద్ది ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలవరం డ్యాం నిర్మాణం కాంటూరు లెక్కలు అన్ని తప్పులు తడకగా ఉన్నాయని. ముప్పై ఎనిమిది మీటర్ల నీరు పోలవరం వద్ద చేరగానే నాలుగు విలీన మండలాలన్ని నిండా మునిగి పోయాయాన్నారు. వరదలు సంభవించి ముంపు ప్రాంతాల్లో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని పరిహారం మాత్రం ప్రభుత్వాలు ఇవ్వకుండా నామమాత్రంగా కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడం దుర్మార్గమన్నారు. వరదల్లో కోల్పోయిన ఇల్లు శుభ్రం చేసుకోవడానికి ఐదు వేల నుండి ఆరు వేల వరకు ఖర్చు అయ్యిందని. కూనవరం వీఆర్పురం లాంటి మండలాల్లో వరద తాకిడికి నివాసాల్లో బురద పేరుకుపోయి నేటికీ స్మశాన వాతావరణంకనిపిస్తుందని అన్నారు.

also read :రెడ్ సెల్యూట్ ..కొరటాల సత్యన్నారాయణ

 

కంటితుడుపు చర్యగా కందిపప్పు బియ్యం మాత్రమే ఇచ్చి వీటితోనే బతకని చెప్పడం ప్రభుత్వ దివాలా కోరుతనానికి నిదర్శనమన్నారు. పోలవరం ప్రాజెక్టు కంటే ముందుగా ముంపుకు గురవుతున్న ప్రాంతాల వాసులకు పరిహారం పునరావాసం కల్పించాలని న్యాయస్థానాలు గట్టిగా చెప్పి జీవోలు జారీ చేసిన కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పెడచెవిన పెట్టారన్నారు. ఇప్పటికే పునరావాస కాలనీల్లో సరైన సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ముంపుకు గురవుతున్న నిర్వాసితులకు మరల మునిగిపోయే చోటే పునరావాస కాలనీల కట్టడం ప్రభుత్వం బుర్ర లేని తనం గా వ్యవహరించింది అన్నారు. పునరావాస కాలనీల్లో 16 రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్వాసితులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా వాటిని బేఖాతరు చేశారని విమర్శించారు. ఆరుగాలం కష్టించి పండించిన రైతుల పంట ధాన్యాలు వరదలకు కొట్టుకుపోయి దీనావస్థలో ఉన్నారని అన్నారు. ఇల్లు కోల్పోయిన వారికి రెండు లక్షల రూపాయలు. పాక్షికంగా దెబ్బతిన్న వాటికి 50 వేల రూపాయల వరకు చెల్లించాలని తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

–also read : బాధిత కుటుంబాలకు మాజీ ఎంపీ పొంగులేటి పరామర్శ, ఆర్ధికసాయం

కాపర్ డ్యాం బ్యాక్ వాటర్ తో ముంపుకు గురైన ప్రాంతాలలో వీటిని కూడా 41 పాయింట్ 15 కాంటూరు లో చేర్చాలన్నారు. వరదల అనంతరం ఏజెన్సీ ప్రాంతంలో వ్యాపించిన విష జ్వరాలు డెంగీ మలేరియా టైఫాయిడ్ పరీక్ష కిట్లను ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహించడంతో ఎన్నో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అన్నారు. రెండు నెలల్లో నాలుగుసార్లు వచ్చిన వరదల తాకిడికి జన జీవనం అసలా కు దూరమైందని అధికార పార్టీ ఎమ్మెల్యే ముంపు ప్రాంతాల్లో పర్యటించకుండా సహాయ సహకారాలు అందించకుండా ముంపు ప్రాంత బాధితుల గోడు ప్రభుత్వానికి నివేదిక అందించకుండా తీవ్ర నిర్లక్ష్యం చేయడంపై ముంపు మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

  also read :కంటైనర్‌ టెర్మినల్‌ వద్ద మత్స్యకారుల నిరసన

 

మొదటిసారి వరదల అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం చింతూరు మండలం లోని చట్టి. కుయుగురు గ్రామల్లో నే పర్యటించి నిర్వాసిత ప్రజానీకానికి పోలవరం పరిహారం పునరావాసం పై ఎటువంటి హామీ ఇవ్వకుండా 45. కాంటూర్ లో ముంపుకు గురైన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయలు ఇస్తేనే తాను పరిహారం ఇవ్వడం జరుగుతుందని. లేదంటే నేను ఏమీ చేయలేని పరిస్థితి ఉందని చేతులెత్తేసి హెలికాప్టర్లో వెళ్లిపోవడం ముఖ్యమంత్రిగా తాను ముంపు మండలాల ప్రజలకు నిరాశ మిగిల్చిన ఆరు అని అన్నారు. భద్రాచలం వద్ద 71.2 అడుగులు నీటిమట్టం నమోదు కాగానే 1986 వరదల లెక్కలు దాటి రావడం ముంపు ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది అన్నారు. వరద తాకిడికి నిర్వాసితులు నిండా మునిగి పోయి విలువైన వస్తువులు వాహనాలు కోల్పోయి ఒక్క కుటుంబం లక్షల రూపాయల్లో నష్టాన్ని చవి చూసిందని అన్నారు.

also read :పాఠశాలలో భోజన ప్లేట్ల వితరణ

అనంతరం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పల్లపు వెంకట్ మండల కార్యదర్శి సురేష్ లు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కూడా పోలవరం ముంపుకు గురవుతున్న ప్రాంతాలను పట్టించుకోకుండా కేవలం ప్రాజెక్టు పనుల పైన దృష్టి పెట్టారని అన్నారు. ఎకరాకు కేవలం లక్షా 15 వేల రూపాయలు మాత్రమే కొంతమందికి ఇచ్చి నిలిపివేశారని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మిగతా ఐదు లక్షల రూపాయలు ఎకరాకు ఇస్తామని హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా కానీ పరిహారం మాత్రం ఎవ్వరికీ అందలేదని అన్నారు. నాలుగు సార్లు వచ్చిన వరదలకు రైతులు పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయారని కనీసం రైతాంగానికి ఎటువంటి భరోసా కల్పించలేని ముఖ్యమంత్రి పేదల బతుకులు ఎలా మారుస్తారని ప్రశ్నించారు. పోలవరం డ్యాం పరిహారం పూర్తిగా నిర్వాసితులకు అందే వరకు పునరావాసం కల్పించే వరకూ ఈ పోరాటం ఆగదని కుల మత పార్టీలకతీతంగా తాము ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని కలిసి వచ్చే వారందరినీ కలుపుకుంటూ ముందుకు పోదామని పిలుపునిచ్చారు. 26వ తేదీ చలో కూనవరం నిర్వాసితుల పోరుబాట సభకు అందరూ కదిలి రావాలని దేశ రక్షణ బేరి పేరుతో జరిగే ఈ సభకు సిపిఎం పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు. ఆదివాసి అధికార రాష్ట్రీయ మంచ్ చైర్మన్ డాక్టర్ మీడియం బాబురావు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పన కిరణ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు ఈ సభకు హాజరవుతున్నట్లు తెలియజేశారు. అనంతరం


చింతూరు మండల కేంద్రంలోని బీసీ ఎస్సీ గొల్ల బజార్ కాలనీలో గుండా పోలవరం పోరుయాత్ర కొనసాగి అనంతరం మండల ప్రధాన కూడలి వద్ద చేరుకొని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కుంజా సీతారామయ్య, జిల్లా కమిటీ సభ్యులు పల్లపు వెంకట్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు మల్లం సుబ్బమ్మ. ము రం రంగమ్మ. ఎంపీటీసీ వే ఖ రాజ్ కుమార్, మండల కమిటీ సభ్యులు మొటుం రాజయ్య, కారం నాగేష్, కారం సుబ్బారావు, మడకం చెన్నయ్య. పొడియం లక్ష్మణ్. సవలం నారాయణ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube