టీ మీడియా,డిసెంబర్ 25,కరకగూడెం;
కరుణ మయుడు లోక రక్షకుడు యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్బంగా కరకగూడెం మండల కేంద్రంలో చేర్చి పాస్టర్ శ్యామ్ సుందర్ చేతుల మీదుగా కేక్ కట్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా పాస్టర్ మాట్లాడుతూ…గత
పాస్టర్ బిలపాటి సంజీవరావు కొన్ని నెలల క్రిందట అనారోగ్యంతో మృతి చెందడం చాలా భాదకరమని,ఈరోజున వారిని స్మరించుకుంటూ వారి పేరు మీద యేసు క్రీస్తు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి పిల్లలకు, పెద్దలకు అన్నదానం నిర్వహించి, వృద్దులకు వితంతువులకు ఊరందరి సమక్షంలో బట్టలను పంచిపెట్టేవారు. వారియొక్క అనుభూతిని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మెలిపెద్ది నరసింహరావు,సాంబశివరావు,నిట్ట కుమారి,నిట్టా శ్రీదేవి,బోడ సరస్వతి,నిట్టా శ్రావణి పాల్గొన్నారు.