వినియోగదారులకు అందుబాటులో ఉప తపాలా కార్యాలయం

వినియోగదారులకు అందుబాటులో ఉప తపాలా కార్యాలయం

1
TMedia (Telugu News) :

వినియోగదారులకు అందుబాటులో ఉప తపాలా కార్యాలయం
టీ మీడియా,మే 20; చింతూరు :మండలం ప్రజలు, వినియోగదారులు ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తున్న చింతూరు ఉప తపాలా కార్యాలయం ఈరోజు అనగా శుక్రవారం నాడు ఉదయం తొమ్మిది గంటలకి చింతూరు మండల కేంద్రంలో. రామాలయం వీధి. సినిమా హాల్ రోడ్డు లో ప్రారంభించడం జరిగినది. ఈ ఉప తపాలా కార్యాలయం ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పని చేయును. ఈ ఆఫీసు నందు సేవింగ్స్ బ్యాంక్ అనగా SB/RD/TD/సుకన్య సమృద్ధి ఖాతాల లావాదేవీలు, తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా మనీ ట్రాన్స్ఫర్, IPPB లావాదేవీలు, AEPS చెల్లింపులు ఎటువంటి రుసుము లేకుండా సేవలు అందిస్తారు. ముఖ్యంగా కోర్ బ్యాంకింగ్ సేవలు ఆన్లైన్ సర్వీసులు ఈ ఉప తపాలా కార్యాలయం లో లభ్యమగును.

Also Read : కొండెక్కిన ట‌మాటా ధ‌ర‌ కిలో రూ. 100

అదే విధంగా కస్టమర్ సర్వీస్ సెంటర్ ద్వారా ప్రజా సంబంధ సేవలు, అన్ని బ్యాంకులకు సంబంధించిన ఆధార్ ఆధారిత చెల్లింపులు ఉచితంగా చేసెదరు. ఈ అవకాశాన్ని చింతూరు మండల ప్రజలు వినియోగించుకోగలరని తపాలాశాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమం లో పోస్టల్ డిపార్ట్మెంట్ ఏఎస్పీ గారు శ్రీ జి. రామకృష్ణ గారు, పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు గారు. పోస్ట్మాస్టర్ సుందర రావు గారు అదేవిధంగా తపాలా శాఖ కి సంబంధించిన అధికారులు, గ్రామీణ తపాలా ఉద్యోగులు పాల్గొనడం జరిగినది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube