విద్యార్థులను అభినందించిన మంత్రి పువ్వాడ

ఈ సెట్ పోస్టర్ ఆవిష్కరణ 

1
TMedia (Telugu News) :

విద్యార్థులను అభినందించిన మంత్రి పువ్వాడ
-ఈ సెట్ పోస్టర్ ఆవిష్కరణ
టీ మీడియా,సెప్టెంబర్ 8,ఖమ్మం :  ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి చేతుల మీదుగా టెక్నో గేట్ కోచింగ్ సెంటర్ ఆన్లైన్ యాప్ ద్వారా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ప్రకటించిన ఈ సెట్ ఫలితాల్లో స్టేట్ మొదటి ర్యాంకుతో పాటు వందలోపు అరవై అయిదు ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించి మెమోంటోలను మరియు మెడల్స్ ను అందజేసి మాట్లాడారు . మీరు అనుకున్న లక్ష్యానికి చేరుకుని మీ తల్లిదండ్రులు మీ పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆకాక్షించారు . మరెన్నో ర్యాంకులు సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు.

Also Read : విద్యార్థులతో టాయిలెట్‌ శుభ్రం చేయించిన ప్రిన్సిపాల్‌

టెక్నో గేట్ కోచింగ్ సెంటర్ సంస్థ ద్వారా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న నిర్వాహకులను అభినందించారు . గతంలో కూడా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా చాలా మంది విద్యార్థుల గేట్ , ఈసెట్ , ఐసెట్ , పాలిసెట్ , ఎంసెట్ , సబ్ ఇంజనీరింగ్ , ఆప్టిట్యూడ్ & రీజనింగ్ కోర్సులో ర్యాంకులను సాధించారని కోచింగ్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు . అనంతరం మంత్రి గారితో కలిసి నిర్వాహకులు టెక్నో గేట్ మరియు టెక్నో ఈ సెట్ ఆన్లైన్ యాప్ పోస్టర్ ను ఆవిష్కరించారు . ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ , ఎస్.బి.ఐ.టీ ఇంజనీరింగ్ కళాశాల చైర్మెన్ ఆర్.జె.సి.కృష్ణ , నగర అధ్యక్షులు పగడాల నాగరాజు , కర్నాటక కృష్ణ , పీ.ఏ కిరణ్ , బత్తుల మురళీ , నగర గ్రంథాలయ చైర్మన్ ఆసిఫ్ , ముస్లిం మైనార్టీ నాయకులు తాజుద్దీన్ , టెక్నో గేట్ సంస్థ డైరెక్టర్ వాజిద్ , ఇంఛార్జ్ సాయి చరణ్ , సిబ్బంది ఇమ్రాన్ , ఫిర్దోస్ , మానస , స్వప్న మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇసాకు , షేక్.తాజుద్దీన్ , ఎండీ.మెుషిన్ తదితరులు పాల్గొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube