కామ్రేడ్ చండ్రపుల్లారెడ్డి 38 వ వర్ధంతి సభ పోస్టర్ ఆవిష్కరణ

చండ్రపుల్లారెడ్డి వర్ధంతి నీ జయప్రదం చేయండి

1
TMedia (Telugu News) :

కామ్రేడ్ చండ్రపుల్లారెడ్డి 38 వ వర్ధంతి సభ పోస్టర్ ఆవిష్కరణ

-చండ్రపుల్లారెడ్డి వర్ధంతి నీ జయప్రదం చేయండి

టీ మీడియా,నవంబర్ 4,ఖమ్మం :  ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశం ఇల్లందులో జరిగే కామ్రేడ్ చండ్రపుల్లారెడ్డి 38వ వర్ధంతి సభ పోస్టల్ ఆస్కరించి సభను జయప్రదం చేయాలని నాయకులు షేక్ సైదులు , ఇఫ్టూ నూతన అద్యక్షులు కర్నాటి మల్లేష్ పిలుపునిచ్చారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరిలోయ ప్రతిఘటన పోరాట నిర్మాత , అమరుడు కామ్రేడ్ చండ్రపుల్లారెడ్డి 38వ వర్ధంతిని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాలలో నవంబర్-1 నుండి 30 వరకు గ్రామగ్రామాన స్థానిక అమరవీరుల సంస్మరణ సభలను నిర్వహించండని సిపిఐ ( ఎం.ఎల్ ) ప్రతిఘటన కేంద్ర కమిటి ఇచ్చిన పిలుపులో బాగంగా బద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో గల కళాస్తి బస్తి , బాలాజిరామాలయం కమ్యూనిటీ హాలులో నవంబరు-9 న జరిగే కామ్రేడ్ చండ్రపుల్లారెడ్డి 38 వర్ధంతి సభను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు-కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి , ఇఫ్టూ తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు కర్నాటి మల్లేష్ ప్రజలను , ప్రజాస్వామికవాదులను , విప్లవ అభిమానులను ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో కోరారు .

Also Read : విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ చేసిన ఉప సర్పంచ్

ఖమ్మం పట్టణంలో ఐఎఫ్టియు ముఖ్యుల సమావేశంలో తీసుకున్న పలుతీర్మానాలను గుర్తుచేశారు . ఇఫ్టూ నూతన రాష్ట్ర అద్యక్షులుగా కర్నాటి మల్లేష్ ను ఏకగ్రీవంగా ఎనుకొన్నారని తెలియజేశారు . పోరాడీ సాదింకున్న కార్మిక హక్కుల పరిరక్షణకు సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరాన్ని గుర్తించిందని భారత కార్మిక సంఘాల సమాఖ్య అద్యక్షులు కె.మల్లేష్ తెలియజేశారు . వ్యవసాయ రంగంలో కార్పొరేట్ రంగానికి అప్పగించడం ద్వారా తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం గురైందని ఎస్. కె.సైదులు గుర్తుచేశారు . ఈసమావేశంలో సిపిఐ (ఎం.ఎల్) ప్రతిఘటన కేంద్ర కమిటీ కార్యదర్శి షేక్ షావలి ప్రసంగిస్తూ విప్లవకారుల ఐక్యతకు పిలుపునిచ్చారు . భూమి , భుక్తి , పీడిత ప్రజల విముక్తే లక్ష్యంగా చేసుకొని వర్గపోరాటాలు , ప్రజా ఉద్యమాలు తీవ్రతరం చేయాలని కోరారు . కుల మత ప్రాంతీయ తత్త్వాలకు వ్యతిరేకంగా నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్య సాధనకు క్రుషి చేయాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో కాకటి ప్రసాద్ , జర్పుల రాంసింగ్ తదితరులు పాల్గొన్నరు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube