కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి వ్య‌తిరేకంగా పోస్టర్లు

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి వ్య‌తిరేకంగా పోస్టర్లు

1
TMedia (Telugu News) :

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి వ్య‌తిరేకంగా పోస్టర్లు

టీ మీడియా,ఆగస్టు13,న‌ల్ల‌గొండ : మునుగోడు నియోజ‌వ‌క‌ర్గంలో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి వ్య‌తిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ‘మునుగోడు నిన్ను క్ష‌మించ‌దు.. రూ. 22 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం.. 13 ఏండ్ల న‌మ్మ‌కాన్ని అమ్ముకున్న ద్రోహివి. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ‌ను ఈడీ వేధిస్తున్న రోజే అమిత్ షాతో బేర‌మాడిన నీచుడివి’ అని పోస్ట‌ర్ల‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట‌ర్లు న‌ల్ల‌గొండ జిల్లా వ్యాప్తంగా వెలిశాయి.

 

Also Read : కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి రేవంత్ రెడ్డి బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌

 

మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ఇక మిగిలింది ఉప ఎన్నికే. ఈ నేప‌థ్యంలో ఆయా పార్టీలు మునుగోడుపై దృష్టి కేంద్రీక‌రించాయి. కోమ‌టిరెడ్డి ఈ నెల 21న బీజేపీలో చేర‌నున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube