టీ మీడియా వనపర్తి అక్టోబర్ 27 : మదనాపురం మండలం తిరుమలయ్య పల్లి గ్రామంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బీమా లిఫ్ట్ టు కెనాల్ మోటర్ దగ్గర సర్వీస్ వైర్లు దొంగతనం చేశారు. రైతుల తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం అర్ధరాత్రి సర్వీస్ వైర్లు చోరికి సుమారు 80 వేల రూపాయల నష్టం ఐదు మంది రైతుల దగ్గర విద్యుత్ కేబుల్ వైరు చోరీ చేయడం జరిగిందని ఉదయాన్నే కెనాల్ దగ్గరికి వచ్చి మోటర్ ఆన్ చేద్దామని చూడగా వైర్లు లేకపోవడంతో రైతులు అందోళన చెందారని తెలిపారు. కెనాల్ నీళ్లతో వరి సాగు కోసం కెనాలో మోటార్ వేసి వరి సాగు చేసే వాళ్ళని చివరి సమయంలో నోటి కాడి కూడు లాగినట్టు ఇలా జరగడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంపిటిసి సరస్వతి రామచంద్రయ్య వెంటనే స్పందించి మదనపురం ఎస్సై కి కంప్లీట్ ఇవ్వడంతో దొంగలను కఠినంగా శిక్షించాలని రైతులు కోరడం జరిగింది.
ఇంతకుముందు గతంలో గడ్డమీద రైతు విద్యుత్ కేబుల్ వైర్ చోరీ. చేయడం జరిగిందని తెలిపారు. కంప్లీట్ ఇచ్చిన వారిలో ఎంపీటీసీ సరస్వతి రామచంద్రయ్య బోయిని బజార్ సంద శీను, ఉశన్న, చిన్న రాజన్న, రైతులు తదితరులు పాల్గొన్నారు.