పట్టణంలో విచ్చలవిడిగా కరెంటు కోత

పట్టణంలో విచ్చలవిడిగా కరెంటు కోత

2
TMedia (Telugu News) :

పట్టణంలో విచ్చలవిడిగా కరెంటు కోత

 

టీ మీడియా, అక్టోబర్ 26, వనపర్తి బ్యూరో : విలీన గ్రామాలతో పాటు కొన్నివార్డులలో లోవోల్టేజ్ సమస్య ఫీదర్లు పెంచాలని, రోడ్డు వెడల్పుల్లో ఒక్కోచోట ఒక్కోలా పాతిన స్తంభాలు. ఇంకా పలు సమస్యలతో ఎస్ఈ కి విన్నవించిన అఖిలపక్ష ఐక్యవేదిక.వనపర్తి జిల్లా కేంద్రంలో నెలకొన్న కరెంటు కష్టాలు ఇతర ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు వివరించడానికి వెళ్లడంతో ఎస్ఈ అప్పుడే క్యాంపుకు వెళ్లారని తెలిసి ఫోన్ చేయడంతో స్పందించిన ఎస్.ఈ టెక్నికల్ కి వినతిపత్రం ఇవ్వండి అని తెలుపడంతో,వారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రంలో కొద్ది రోజులుగా విద్యుత్ కోత ప్రజలకు తెలుపకుండానే జరుగుతుందని అలాగే విలీన గ్రామాల్లో, కొన్ని వార్డులలో వోల్టేజ్ సమస్య ఉందని, చాలా వరకు కొత్త ట్రాన్స్ఫారంలో ఏర్పాటు చేయాలని అంతేగాక ఇంత పెద్ద వనపర్తికి మూడు ఫీడర్లే ఉండడంతో చాలా సమస్యలు ఏర్పడుతున్నాయని..

 

Also Read : కబడ్డీ పోటీలను విజయంతం చేయండి

 

ఇంకా రెండు ఫీడర్లు ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని, విలీన గ్రామాల్లో కొన్ని వార్డులలో కరెంటు స్తంభాల కొరత తీర్చాలని, రోడ్డు వెడల్పులో భాగంగా వేస్తున్న కరెంటు స్తంభాలు అక్కడక్కడ నిబంధనలకు విరుద్ధంగా 20 ఫీట్లకి పాతడంతో పలు సమస్యలు తలెత్తుతున్నాయని,ప్రభుత్వం ప్రకటించిన చేతివృత్తుల వారికి 200 యూనిట్ల లోపు ఉన్న బిల్లులు మాఫీ చేయాలని ప్రభుత్వం ప్రకటించిందని, అయినా కూడా ఇంకా బిల్లులు వచ్చి వారిని బిల్లు కట్టమని చెప్తున్నందున అది తొలగించాలని ఈ సమస్యల పైన ఇంతకుముందే డి.ఈ కి విన్నవించుకోవడం జరిగిందని ఇకముందు ప్రజల ఇబ్బందులు తొలగించడానికి, పై సమస్యలు పరిష్కరించకుంటే లోకాయుక్తకు ఆశ్రయించడం జరుగుతుందని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎస్.పీ అధ్యక్షుడు జానంపేట రాములు, సిపిఐ కార్యదర్శి రమేష్, ప్రజల పార్టీ అధ్యక్షుడు అడ్వకేట్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube