దేశానికి జీవనాడి విద్యుత్ రంగం – విద్యుత్ రంగం ప్రైవేటీకరణను అడ్జుకుంటాం.

0
TMedia (Telugu News) :

విద్యుత్ సవరణబిల్లు విరవిుచుకోవాలి. సిఐటియు

టీ మీడియా,డిసెంబర్,10, భద్రాచలం

కేంద ప్రభుత్వం రూపొందించిన విద్యుత్ చట్టం సవరణ బిల్లు 2020-2021ని రద్దు చేయాలని
డిమాండ్ చేస్తూ నేషనల్ కోఆర్డినేషన్ కవిుటి ఆఫ్ ఇంజనీర్స్ & ఎలక్ట్రసిటి ఎంప్లాయిస్(ఎన్ సి ఓ ఈ ఈ) దేశవ్యప్త పిలుపులో భాగంగా భద్రాచలం డిఈ కార్యలయంలో
విధ్యుత్ ఉధ్యోగులు, కార్మికులు భోజన విరామసమయంలో ధర్నా
నిర్వహించారు.ఈ దర్నాకు సిఐటియు సంఘీభావం తెలియజేసింది.సిఐటియు జిల్లా కార్యదర్శి ఏజే.రమేష్ దర్నాకి సంఘీభావం తెలియజేస్తూ దేశానికి జీవనాడి విద్యుత్ రంగమని అన్నారు.విద్యుత్
రంగాన్ని ప్రైవేటీకరించేందుకు బిజెపి ప్రభుత్వం తెచ్చిన విద్యత్ చట్ట సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నూతన విద్యుత్‌ చట్టం వస్తే క్రాస్‌ సబ్సిడీ పోతుంది.

తద్వారా 100,200 యూనిట్లలోపు ఉన్న మన రాష్ట్రంలోని 59 లక్షల మంది విద్యుత్‌ వినియోగదారులు వారి ఛార్జీలలో పొందుతున్న రాయితీ పోతుంది.విద్యుత్‌ ఉత్పత్తి,పంపిణీకి అయిన ఖర్చు ప్రకారం టారీఫ్‌ను చెల్లించవలసి ఉంటుంది. ఉదాహరణకు యూనిట్‌ కు రూ.6 కు పైగా భరించాల్సి వస్తుంది.ఫలితంగా పేద, మధ్యతరగతి ప్రజలకు కరెంటు బిల్లులు గుదిబండగా మారతాయి.అలాగే మన రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ,బలహీన వర్గాలకు చెందిన క్షౌర శాలలకు,లాండ్రీ షాపులకు(250 యూనిట్ల) ఇస్తున్న విద్యుత్తు రాయితీ ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. రాష్ట్రంలో 25 లక్షల రైతుల వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడతారు,ఉచిత కరెంటు ఉండదు.రైతులు ముందుగా కరెంటు బిల్లులు చెల్లించి,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయదారులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతారు.

ఇంజనీర్స్ అసోషేసియన్ తరుపున ఏఈ రాజేష్ మాట్లాడుతూ ఈ బిల్లు చట్టంగా మారితే విద్యుత్‌ ఉత్పత్తి,సరఫరా,పంపిణీ వ్యవస్థలోకి ప్రయివేటు సంస్థలు,ఫ్రాంచైజీలు,సబ్‌ లైసెన్స్‌దారుల ప్రవేశం వల్ల మన రాష్ట్రంలోని 50వేల మంది ఉద్యోగులు, ఇంజనీర్లు, 23,600 మంది ఆర్టిజెన్లు, 6,500 మంది పీస్‌ రేటు వర్కర్స్‌, అన్‌మెన్‌ వర్కర్స్‌ ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడతారు.గతంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం విద్యుత్‌ రంగంలో సంస్కరణలకు ప్రయత్నిస్తే ఉద్యోగులు తీవ్రంగా ప్రతిఘటించి విజయం సాధించిన అనుభవం ఉంది. వారి స్ఫూర్తితో దేశవ్యాప్త ఉద్యమానికి విద్యుత్‌ ఉద్యోగులు సిద్ధ మవుతున్నారని తెలిపారు. ఎన్ని రోజులైనా నిరవధిక సమ్మెకు సిద్దంగా వున్నామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.అన్నీ స్ధాయిల ఉద్యోగులను,కార్మికులను, ప్రజలను భాగస్వాములు చేస్తూ ఐక్యంగా పోరాడాలని కోరారు.సంస్ధను ప్రైవేటీకరణ నుండి కాపాడు కునేందుకు ఎటువంటి పోరాటాలకైనా సిద్దంగా వున్నామని 327 యూనియన్ అద్యక్షులు సర్వేశ్వరావు తెలిపారు. ధర్నాలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.బ్రహ్మాచారి, యుఈఈయు జిల్లా అద్యక్షులు కొలగాని రమేష్ మాట్లాడారు. దర్నాలో 1104 యూనియన్ నాయకులు కెటిఎన్ మూర్తి,ఏఈ ఉపేందర్,ఏఏఓ సత్యనారయణ, 327యూనిన్ త్రినాద్ రెడ్డి,యుఈఈయు నాయకులు బడిగే రమేష్, శంకర్,సందీప్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube