ప్రభాస్‌-మారుతి మూవీలో బాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ హీరో?

ప్రభాస్‌-మారుతి మూవీలో బాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ హీరో?

1
TMedia (Telugu News) :

ప్రభాస్‌-మారుతి మూవీలో బాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ హీరో?

టీ మీడియా,సెప్టెంబర్ 26, సినిమా: ప్రభాస్‌ ప్రస్తుతం ఒక భారీ హిట్టు కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నాడు. ‘బాహుబలి’ వంటి బ్లాక్‌ బస్టర్‌ విజయం తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్‌’ సినిమాలు వరుసగా ఫ్లాప్‌ అవడంతో డార్లింగ్‌ అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు. ఈయన కంబ్యాక్‌ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్‌-మారుతి కాంబినేష‌న్‌లో సినిమా గురించి గ‌త కొన్ని నెల‌లుగా ప్ర‌చారం సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇక ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. మారుతి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులను కూడా పూర్తి చేశాడట. ప్రభాస్‌ ఎప్పుడు రెడీ అంటే అప్పుడు సినిమా సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంద‌ట‌. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.ఈ మూవీ మొత్తం ‘రాజా డిల‌క్స్’ అనే థియేట‌ర్ చుట్టూ తిరిగే తాత‌-మ‌న‌వ‌ళ్ల క‌థ‌తో సాగుతుంద‌ట‌. ఇదే క‌థ‌కి హార్రర్ క‌మెడీ ట‌చ్ అప్ ఇచ్చి మారుతి త‌న‌ శైలిలో మూవీని తెర‌కెక్కించ‌నున్నాడట. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం కోసం ఓ బాలీవుడ్‌ స్టార్‌ నటుడిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది ‘కేజీఎఫ్‌-2’, ‘షంషేరా’ వంటి సినిమాలతో విలనిజంను పండించిన సంజయ్‌ దత్‌ను ఈ సినిమాలో కీలకపాత్ర కోసం ఎంపిక చేశారట.

Also Read : యూకే, యూరప్ దేశాల్లో శ్రీనివాస కల్యాణాలు

ఇప్పటికే చర్చలు కూడా ముగిసాయట. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.ఈ సినిమా కోసం చిత్ర యూనిట్‌ ఇప్ప‌టికే రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ థియేట‌ర్ సెట్‌ను నిర్మించిన‌ట్లు తెలుస్తుంది. కేవ‌లం ఈ సెట్ కోస‌మే మేక‌ర్స్ 6కోట్లు ఖ‌ర్చు చేశార‌ట‌. ఇక మారుతి ఈ సినిమాను రెండు షెడ్యూల్స్‌లోనే పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కు జోడీగా మాళ‌విక మోహ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అన్ని కుదిరితే న‌వంబ‌ర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళే ఛాన్స్ ఉందట‌.ప్రస్తుతం ప్రభాస్‌ నటించిన ‘ఆదిపురుష్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. తన్హాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రామాయణం నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ఇది వరకే తెలిపారు. కాగా వచ్చే నెల నుండి చిత్రబృందం కంటీన్యూస్‌గా ప్రమోషన్‌లను జరుపనుందట. ఇక దీనితో పాటుగా ప్రభాస్‌ ‘సలార్‌’, ప్రాజెక్ట్‌-  చిత్రాలను చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube