డిప్యూటీ సీఎం భ‌ట్టి అధికారిక నివాసంగా ప్ర‌జా భ‌వ‌న్

డిప్యూటీ సీఎం భ‌ట్టి అధికారిక నివాసంగా ప్ర‌జా భ‌వ‌న్

0
TMedia (Telugu News) :

డిప్యూటీ సీఎం భ‌ట్టి అధికారిక నివాసంగా ప్ర‌జా భ‌వ‌న్

టీ మీడియా, డిసెంబర్ 13, హైద‌రాబాద్ : తెలంగాణ డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అధికారిక నివాసంగా ప్ర‌భుత్వం ప్ర‌జా భ‌వ‌న్‌ను కేటాయించింది. ఈ మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇక నుంచి భ‌ట్టి విక్ర‌మార్క బేగంపేట్‌లోని ప్ర‌జా భ‌వ‌న్‌లో అధికారికంగా ఉండ‌నున్నారు. అయితే ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను ఈ ప్ర‌భుత్వం ప్ర‌జా భ‌వ‌న్‌గా మార్చిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌జా భ‌వ‌న్‌లోనే ప్ర‌తి మంగ‌ళ‌, శుక్ర‌వారాల్లో ప్ర‌జా ద‌ర్బార్ నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌జా ద‌ర్బార్ నిర్వ‌హించిన ప్ర‌భుత్వం.. సామాన్యుల నుంచి విన‌తులు స్వీక‌రించి, ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తోంది.

Also Read : గిరిజనుల భూములు కబ్జా చేశారంటూ

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube