ప్రజా వాణి నిర్వహిస్తున్న మంత్రి సీతక్క

ప్రజా వాణి నిర్వహిస్తున్న మంత్రి సీతక్క

0
TMedia (Telugu News) :

ప్రజా వాణి నిర్వహిస్తున్న మంత్రి సీతక్క

టి మీడియా, డిసెంబర్ 26,హైదరాబాద్ : ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. తమ సమస్యలను చెప్పుకు నేందుకు ఉదయం 6 గంటల నుంచే జనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ధరణి సమస్యలు, పెన్షన్, డబుల్ బెడ్‌రూమ్ సమ స్యలపై ఎక్కువగా ఫిర్యా దులు వస్తున్నట్లు అధికా రులు తెలిపారు.ప్రతి మంగళ, శుక్రవారం ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజా సమస్యలపై ధరఖాస్తులు స్వీకరించేందుకు తెలంగాణ సర్కార్ నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తోంది.ప్రజా భవన్‌లో నిర్వహి స్తున్న ఈ కార్యక్ర మానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పింఛన్లు, ఇళ్లు, ఉద్యోగాలు ఇప్పించాలని పెద్ద ఎత్తున వచ్చిన జనాలు తమ సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు అందజేస్తు న్నారు.

Also Read : డీసీసీబీ డైరెక్టర్ వేముల శ్రీనివాసరావు మృతి పట్ల ఎంపీ నామ సంతాపం

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube