క్యాథ్ ల్యాబ్ ప్రజలకు వరం

-నిండు ప్రాణాలు కాపాడుతున్న వైద్యులు

1
TMedia (Telugu News) :

క్యాథ్ ల్యాబ్ ప్రజలకు వరం ”
-నిండు ప్రాణాలు కాపాడుతున్న వైద్యులు

➖ జడ్పీ చైర్మన్ *లింగాల కమల్ రాజు

టీ మీడియా, మార్చి 3,ఖమ్మం: జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.7 కోట్ల రూపాయల తో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్ తో ఎంతోమంది నిండు ప్రాణాలను వైద్యులు కాపాడుతున్నారని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు..గురువారం ఖమ్మం లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్ ద్వారా ఛాతి నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి కి స్టెంట్ వేసి ప్రాణాలను కాపాడారు..కాగా ఆసుపత్రికి వెళ్లి క్యాథ్ ల్యాబ్ ని పరిశీలించిన జడ్పీ చైర్మన్ కమల్ రాజు స్టెంట్ వేయించుకున్న పెషేంట్ తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయట ప్రైవేట్ హాస్పిటల్స్ నందు దాదాపుగా రూ.3 లక్షల వరుకు స్టెంట్ వేస్తే ఖర్చు అవుతుందని అలాంటిది ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి ఉచితంగా హృద్రోగ వైద్య సేవలు అందించి వ్యక్తి ప్రాణాలను వైద్యులు రక్షించారని తెలిపారు .

ALSO READ:బంగాళాఖాతంలో  

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం కోసం పెద్దపీట వేస్తూ క్యాథ్ ల్యాబ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఇప్పుడు అది జిల్లా ప్రజలకు ముఖ్యంగా నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు వరం లాగా మారిందన్నారు..ఈ సందర్భంగా క్యాథ్ ల్యాబ్ ద్వారా ప్రాణాలను కాపాడుతున్న ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు,RMO బోల్లికొండ శ్రీనివాస్,జిల్లా వైద్యాధికారి మాలతి ,వైద్యులు సీతారాం, సురేష్ లతో పాటుగా సిబ్బంది మొత్తాన్ని జడ్పీ చైర్మన్ కమల్ రాజు అభినందించారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube