ప్రమాద ఘటనపై ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను గారు దిగ్భ్రాంతి…

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌ హోటల్లో జరిగిన ప్రమాద ఘటనపై ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను గారు దిగ్భ్రాంతి…

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌ హోటల్లో జరిగిన ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రి ఈ హోటల్‌ను లీజుకు తీసుకొని, అందులో కరోనా వైరస్‌ సోకిన పేషెంట్లను ఉంచి చికిత్స అందిస్తున్న
సమయంలో ప్రమాదం జరిగిందని అన్నారు. ఈ ప్రమాదానికి గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సీఎం వైఎస్‌ జగన్‌ గారు రూ.50 లక్షల పరిహారం ప్రకటించారని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.