ప్రమీలాదేవి మృతి మహిళా ఉద్యమాలకు తీరని లోటు
ఘనంగా నివాళులు అర్పించిన సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి
ప్రమీలాదేవి మృతి మహిళా ఉద్యమాలకు తీరని లోటు
-ఘనంగా నివాళులు అర్పించిన సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి
టి మీడియా,నవంబర్ 26,గోదావరిఖని : తెలంగాణ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్డబ్ల్యూ) రాష్ట్ర నాయకురాలు, మహిళా ఉద్యమ నేత ఏ.ప్రమీల దేవి మరణం పార్టీకి,ప్రజాసంఘాలకు తీరని లోటని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు.
శనివారం గోదావరిఖని అశోక్ నగర్ లోని ప్రమీలా దేవి ఇంటికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి పూలతో ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ… 1982 నుండి ఇప్పటివరకు ప్రతి ఉద్యమంలో కలిసి పనిచేసిన కామ్రేడ్ ప్రమీల మనమధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. దేశవ్యాపితంగా మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించిన ప్రమీలను ఆదర్శంగా తీసుకొని మహిళ సమాఖ్య ను బలోపేతం చేసి ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.ప్రమీల మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతినీ తెలిపారు.
Also Read : వివాదాలకు ఆలయంగా మారిన కాణిపాకం.
ప్రమీల దేవికి సంతాపం తెలిపిన వారిలో సీపీఐ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్, జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం,సహాయ కార్యదర్శి గోసిక మోహన్, జిల్లా మాజీ కార్యదర్శి గౌతం గోవర్ధన్,నగర కార్యదర్శి కే.కనక రాజ్,సహాయ కార్యదర్శి తల్లపెల్లి మల్లయ్య,నాయకులు కే.స్వామి,తాళ్ళ పెల్లి లక్ష్మణ్,కడారి సునీల్,గడిపే మల్లేష్,మాటేటీ శంకర్,మర్కాపురి సూర్య తదితరులు పాల్గొన్నారు.