పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందించిన సీఐ

పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందించిన సీఐ

1
TMedia (Telugu News) :

పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందించిన సీఐ
టి మీడియా,ఏప్రిల్ 08,రామగుండం: పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న.హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతులు పొందిన 8 మంది కానిస్టేబుళ్లను గురువారం అభినందించిన సీఐ రమేష్ బాబు,రాజ్ కుమార్ గౌడ్.ఈ సందర్భంగా సీఐ రమేష్ బాబు, రాజ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని  పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది మరియు అధికారులు పోలీసు శాఖలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని కోరారు.

Also Read : ఇల్లును కాలపెట్టిన ఎలుక :రూ. 2 లక్షల నగదు దహనం..

పోలీసు శాఖలో క్రమశిక్షణతో బాధ్యతగా విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు,గౌరవ మర్యాదలు లభిస్తాయని.ఈ సందర్భంగా వారికి తెలియజేశారు అనంతరం పదోన్నతులు పొందిన 8 మంది జి.భూమయ్య,ఓ.సదయ్య,జి.జంపయ్య, వి.హేమసుందర్, సయ్యద్ ఫజలోద్దీన్,ఆర్.సురేష్, జి. నరేందర్, ఏ.రమేష్ 8 మంది హెడ్ కానిస్టేబుల్స్ కి శాలువాలతో సన్మానం చేసి స్వీట్స్ పంచడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్సైలు రమేష్, నరేష్, ఏ ఎసై మల్లయ్య, మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube