కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన ముకుల్‌ రోహత్గీ

కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన ముకుల్‌ రోహత్గీ

1
TMedia (Telugu News) :

కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన ముకుల్‌ రోహత్గీ

టీ మీడియా,సెప్టెంబర్ 26, న్యూఢిల్లీ: భారత తదుపరి అటార్జీ జనరల్‌ ఎవరనేదానిపై సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. ఏజీ పదవిని చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సీనియర్‌ లాయర్‌ ముకుల్‌ రోహత్గీ తిరస్కరించారు. అత్యున్నత న్యాయాధికారిగా సేవ‌లందించేందుకు ఆయ‌న నిరాకరించారు. గత కొన్ని రోజులుగా రోహత్గీ మరోసారి ఏజీ పదవిని చేపట్టనున్నారని, అక్టోబర్‌ 1న బాధ్యతలు స్వీకరిస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్నది. అయితే త‌న‌కు ఆ ప‌ద‌విపై ఆస‌క్తి లేద‌ని రోహత్గీ ప్రకటించారు. ప్రస్తుతం అటార్జీ జనరల్‌గా కేకే వేణుగోపాల్‌ (91) సేవలు అందిస్తున్నారు. ఆయన పదివీకాలం జూన్‌లో ముగిసిపోయింది.

Also Read : ఉత్కంఠ పోరులో.. భారత్‌ ఘన విజయం.

దీంతో మూడు నెలలపాటు వేణుగోపాల్‌ పదవీకాలాన్ని కేంద్రం పొడిగింది. ఈ నెల 30తో గడువు ముగియనుంది. వయో భారం కారణంగా మరోసారి ఆ పదవిలో కొనసాగడానికి ఆయన ఇష్టపడటం లేదు. దీంతో ప్రభుత్వం ముకుల్‌ రోహగ్నీ పేరును ప్రతిపాదించింది. దీనికి ఆయన తిరస్కరించారు.సీనియర్‌ ముకుల్ రోహత్గీ 2014 నుంచి 2017 వరకు భారతదేశ అటార్నీ జనరల్‌గా ప‌నిచేశారు. అయితే 2017 జూన్‌లో వ్యక్తిగత కారణాలతో ఈ పదవికి రాజీనామా చేశారు. అనంతరం లాయర్‌గా ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. అనేక ప్రధానమైన కేసుల్లో ఆయన సుప్రీంకోర్టుతోపాటు దేశంలోని వివిధ హైకోర్టుల్లో తన వాదనలు వినిపించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube