ప్రైవేట్ ఉన్నత పాఠశాల నుండి ప్రతిపాదనలకు ఆహ్వానం

ఐటీడీఏ పీవో

1
TMedia (Telugu News) :

ప్రైవేట్ ఉన్నత పాఠశాల నుండి ప్రతిపాదనలకు ఆహ్వానం: ఐటీడీఏ పీవో

టీ మీడియా, మే 25, భద్రాచలం

2022- 23 విద్యా సంవత్సరానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా గిరిజన బాల,బాలికలను మూడవ, ఐదవ, ఎనిమిదవ తరగతి లో చేర్చుట కొరకు ఆసక్తి కలిగిన ప్రైవేట్ ఉన్నత పాఠశాల నుండి ప్రతిపాదనలు కోరుతున్నట్లు భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రూ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతలు కలిగిన ప్రైవేట్ ఉన్నత పాఠశాలలో హాస్టల్ వసతి కలిగిన ప్రైవేట్ ఉన్నత పాఠశాలలు ప్రభుత్వం గుర్తింపు పొంది మార్చి 2021 వరకు గడిచిన ఐదు సంవత్సరాలలో పదవ తరగతి ఉత్తీర్ణత శాతం 90% పైగా పొందాలన్నారు.50% ప్రథమ స్థానంలో ఉండాలని అన్నారు. ప్రస్తుతం నిర్వహించే పాఠశాలలో హాస్టల్ వసతి కలిగి ఉండి, విద్యార్థులు కూడా ఉండాలన్నారు. పాఠశాలకు అవసరమైన ఆటస్థలం కలిగియుండి, పాఠశాల, హాస్టల్, ఆరిసీ బిల్డింగ్ కలిగి ఉండాలని, పాఠశాలలో కానీ హాస్టల్లో దళిత, గిరిజన విద్యార్థుల సంఖ్య 50 శాతం నుండి 7వ తరగతి, పదవ తరగతి ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత పొంది ఉండాలని పేర్కొన్నారు.

Also Read : సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం విస్తృత అభివృద్ధి

పాఠశాలకు అవసరమైన ల్యాబ్, వసతి గదులు, లైబ్రరీ, తరగతి గదులు, ఫర్నిచర్ తప్పకుండా ఉండాలని పాఠశాలలో విద్యార్థుల కొరకు వైద్య సదుపాయం ఉండాలన్నారు.పాఠశాలకు తగిన బోధనా పరమైన విద్యార్హతలు అనుభవం ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది ఉండాలన్నారు. పైన పేర్కొనబడిన అర్హతలు కలిగిన ఉన్న పాఠశాలల, యాజమాన్యం ఉపసంచాలకులు, (గిరిజన సంక్షేమం) జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి, కార్యాలయం, భద్రాచలంను సంప్రదించి అవసరమైన దరఖాస్తు నమూనా తీసుకుని, ఇట్టి ప్రతిపాదనలు ఈనెల 31 లోపు సమర్పించాలన్నారు. రాష్ట్ర స్థాయి కమిటీ ద్వారా ఎంపిక కాబడిన పాఠశాలలకు గిరిజన విద్యార్థులను కేటాయిస్తూ వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపకార వేతనాలు ఆన్లైన్ ద్వారా చెల్లించ బడును పీవో తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube