ప్రతిభాతాయ్ పాటిల్ ఇంట్లో విషాదం
టీ మీడియా, ఫిబ్రవరి 24, హైదరాబాద్ : భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభాతాయ్ పాటిల్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. భర్త దేవిసింగ్ షెకావత్ ఈరోజు కన్నుమూశారు. 89 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో దేవి సింగ్ షెకావత్ పుణెలోని కేఈఎం ఆస్పత్రిలో చేరారు. ఈ తరుణంలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 9.30 గంటలకు మృతి చెందారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు పూణెలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.