ప్రవైట్ ఆస్పత్రులు పై ప్రభుత్వం కొరడా

కనీస వసతులు లేనట్లయితే సిజ్

1
TMedia (Telugu News) :

ప్రవైట్ ఆస్పత్రులు పై ప్రభుత్వం కొరడా

– అనుమతి లేకుంటే మూసి వేత

– కనీస వసతులు లేనట్లయితే సిజ్

– క్షేత్ర స్థాయి సర్వే కు ఆదేశాలు

– నివేదికలు ఇవ్వాలని డి ఏం హెచ్ ఓ లకు ఆదేశం

టీ మీడియా,సెప్టెంబర్ 22, వైద్య విభాగం: కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ వైద్యము ఉచితంగా అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం,ప్రవైట్ లో వైద్యం ముసుగు లో జరుగుతున్న ధంద కు చెక్ పెట్టే ప్రయత్నం లో ఉంది.అందుకు కొన్ని మార్గ మార్గ దర్శకాలు రూపొందించి వివరాలు తో కూడిన నివేదిక ఇవ్వాలి అని బుదవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కు ఆదేశాలు ఇచ్చి నట్లు తెలిసింది.ప్రక్కనే ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన శ్రీనివాస రావు హెల్త్ డైరెక్టర్ గా ఉన్నారు.జిల్లాకు చెందిన పలువురు రాష్ట్ర స్థాయి ప్రముఖ ఆస్పల లో కీలక పదవుల్లో ఉన్నారు.మంగళ వారం, ఖమ్మం లోని తెలంగాణా ఆస్పత్రి లో మహిళ లిఫ్టు గుంత లో పడి చని పోవడం,ఇటీవల చట్ట విరుద్ధం గా లింగ నిర్ధారణలు,అభాషన్ల వ్యవహారం బైట పడడం ఖమ్మం ను కుదిపి వేసింది.హైద్రాబాద్ తో పాటు పలు చోట్ల వైద్య రంగం తో స మందం లేని వారు వ్యాపార దృక్పదం తో ఆస్పత్రి లు పెట్టడం శంకర్ దాదా ఏం బి బి ఎస్ లు తో వైద్యం చేయించడం లాంటివి ప్రభుత్వం సీరియస్ గ తీసుకున్నది.కనీస వసతులు లేక పోగా,అనుమతులు లేకుండా చాలా మంది ఆస్పత్రులు నిర్వహిస్తున్న రని ప్రభుత్వం కు పిర్యాదులు ఉన్నయి.

 

 

 

 

 

ఇటువంటివి హైద్రాబాద్ అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లా లో అత్యధికంగా ఉన్నట్లు కూడా ప్రభుత్వం ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.మరో వైపు ప్రభుత్వ పరంగా ఎన్ని సౌకర్యాలు కల్పించినా ప్రజలు వినియో గించు కొక పోగా ,ప్రవైట్ ఉచ్చు లో చిక్కు కుంటున్న రు అనేది కూడా ప్రభుత్వం గుర్తించి నట్లు టెలిసింది.కొంత మంది వైద్య ఆరోగ్య శాఖ అధికారులు,సిబ్బంది ప్రవైట్ అక్రమాల వెనుక ఉన్నారు అనే పిర్యాదులు ఉన్నయి.ఈ నేపథ్యం లో ప్రవైట్ ఆస్పత్రులు లో ఉన్న సౌకర్యాలు గురించి పూర్తి స్థాయి నివేదికలు ఇవ్వాలి అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కు అందినట్లు తెలుస్తోంది. అధికారులు అసలు నివేదికలు ఇస్తారా..?అక్రమ రిపోర్ట్ ఇస్తారా చూడాలి.ఇది ఇలా ఉంటే ప్రభుత్వం ప్రవైట్ వైద్యం పై నియంత్రణ దిశగా అడుగులు వేయడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube