నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులను రద్దు చేయాలి

నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులను రద్దు చేయాలి

1
TMedia (Telugu News) :

నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులను రద్దు చేయాలి

టీ మీడియా,జూన్ 27, వనపర్తి బ్యూరో : జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులను రద్దు చేయాలి అలాగే ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపరచాలి కోరుతూ కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన తరువాత కలెక్టర్ ఆఫీస్ లో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు మెరుగుపరచాలని . ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న దోపిడిని అరికట్టాలనీ . జిల్లాలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల అనుమతులు పరిశీలించి చట్టబద్ధంగా లేని ఆసుపత్రిలను రద్దు చేయాలని వనపర్తి జిల్లా జిల్లా కలెక్టర్ ను కోరారు. తరువాత ఐక్యవేదిక నాయకులు చిరంజీవి, వెంకటేష్, రమేష్,శివ యాదవ్, గుమ్మడం రాజు, పెద్దగూడెం రమేష్ తదితరులు మాట్లాడుతూ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నప్పటి అనుమతులను జిల్లా ఏర్పడిన తరువాత కూడా మార్చకపోవడంతో వనపర్తి జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు వాటికి అనుగుణంగానే పనిచేస్తున్నాయని, సీజనల్ వ్యాధులతో వచ్చిన రోగులకు మరియు ఇతర స్కానింగ్లో పేరుతో దోపిడీ చేస్తున్నారని, చిన్న పిల్లల డాక్టర్ అయితే వారి సెంటిమెంట్ తో ఆడుకుంటున్నారు.

Also Read : సెంట్రలైజ్‌డ్‌ కిచెన్‌ను ప్రారంబించిన మంత్రి హరీష్ రావు

ఎవరో కొందరు డాక్టర్లు,కొన్ని హాస్పిటల్లో తప్ప మిగతా హాస్పిటల్ చాలావరకు నిబంధనలకు విరుద్ధంగా, చాలా వరకు హాస్పిటల్ లు నిబంధనలకు విరుద్ధంగానే పని చేస్తున్నాయని, అలాగే పాలీ క్లినిక్ ల పేరిట వెలసిన స్కానింగ్,టెస్ట్ ల సెంటర్ టు పేద ప్రజలను దోపిడీ చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారని, అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు.గత పది రోజులుగా అన్ని హాస్పిటల్ లను పరిశీలిస్తున్న ఐక్యవేదిక నాయకులు త్వరలోనే అన్ని ఆసుపత్రుల్లో ఉన్న లోపాలను ఒక్కొక్కటిగా చూసి,ఒక నివేదిక తయారు చేసి డీఎంహెచ్వో కు కలెక్టర్ కి, తెలంగాణ రాష్ట్ర విద్య అధికారికి, మంత్రి నిరంజన్ రెడ్డి కి, సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకి మేము తయారు చేసిన, చేయబోయే నివేదికలు సమర్పిస్తామని ఐక్యవేదిక సభ్యులు తెలిపారు.
డాక్టర్లు అందరూ దేవుళ్లే వారికి శతకోటి అభివందనలు కానీ దాంట్లోనే కొందరు వ్యాపారం కోసం పేద ప్రజలను పిడిస్తున్నందుకు వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube