తాజ్‌ మహల్‌లో ప్రార్థనలు

 ముగ్గురు హైదరాబాదీలు అరెస్ట్‌

1
TMedia (Telugu News) :

తాజ్‌ మహల్‌లో ప్రార్థనలు

ముగ్గురు హైదరాబాదీలు అరెస్ట్‌
టి మీడియా, మే26,ఆగ్రా : తాజ్‌ మహల్‌లో ప్రార్థనలు చేసినందుకు నలుగురు పర్యాటకులను సీఐఎస్‌ఎఫ్‌ బుధవారం అరెస్టు చేసింది. ఇందులో ముగ్గురు పర్యాటకులు హైదరాబాద్‌ వాసులు కాగా.. ఓ పర్యాటకుడు అజంగఢ్‌ వాసి. సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు నలుగురిని తాజ్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించగా.. పోలీసులు వారిని విచారిస్తున్నారు. అయితే, తాజ్‌ మహల్‌లో శుక్రవారం మాత్రమే ప్రార్థనలకు అనుమతి ఉంటుందని ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సూపరింటెండెంట్‌ రాజ్‌కుమార్‌ పటేల్‌ తెలిపారు.

Also Read : మావోయిస్టు నాయకుడు మృతి

తాజ్ మహల్‌ పశ్చిమ భాగంలో షాహీ మసీదు ఉన్నది.నిబంధనల ప్రకారం.. తాజ్‌ మహల్‌ శుక్రవారం పర్యాటకులకు మూసివేస్తారు. ఇక్కడ ఉన్న మసీదులో ప్రార్థనలు చేసే వారి కోసం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు తెరుస్తారు. అయితే, నలుగురు పర్యాటకులు మసీదులో ప్రార్థనలు చేస్తుండగా.. అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. గత నెల రోజులుగా తాజ్‌ మహల్‌పై వివాదాలు చుట్టుముట్టాయి. గత నెలలో అయోధ్యకు చెందిన ఓ వ్యక్తి తేజోమహాలయ శివాలయంగా అభివర్ణించిన ఆయన.. ఈ మేరకు తాజ్ మహల్‌లో 22 గదులను తెరువాలని లక్నో హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube