ముందస్తు అరెస్టులు అప్రజాస్వామికం

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 27 వనపర్తి : రైతు సమస్యల పట్ల ఉద్యమిస్తున్న కాంగ్రెస్ నాయకులను ప్రభుత్వం ముందస్తు అరెస్టులపేర్లతో అడ్డుకోవడం అప్రజాస్వామికమని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. సోమవారం అరెస్టు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎర్రవల్లి గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టే రైతులతో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవడం అప్రజాస్వామికమని ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే అని అన్నారు. యాసంగి లో రైతులు వరి పంటసాగు చేయకుండా వారికి ఆంక్షలు విధించడం సరికాదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో రాజకీయ క్రీడలు ఆడడం మానుకోవాలన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు కాంక్షలు పెట్టలేదని గుర్తు చేశారు. అని సీజన్లో రైతులు తమకు ఇష్టం వచ్చిన పంటను సాగు చేసుకున్నారని గుర్తు చేశారు. వరి సాగు వద్దని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు ఎందుకు కట్టారు చెప్పాలన్నారు.

ప్రణాళికలు లేకుండా వ్యవసాయ అధికారులు ఇచ్చే భూసార పరీక్షలు చేయకుండా ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను సరఫరా చేయకుండా రైతు అవగాహన సదస్సులు నిర్వహించకుండా ఇప్పటికిప్పుడే ప్రత్యామ్నాయ పంటలు వేయడం సాధ్యపడదు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలను ముందస్తు అరెస్టులతో అడ్డుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను ప్రజలంతా గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, కంబాలపురం ఎంపిటిసి ఎల్లస్వామి, రాములు యాదవ్, విష్ణు, రాములు యాదవ్ ,శ్రీహరి ,రాజు, ఆశన్న, పురుషోత్తం యాదవ్ ,గోవిందు, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube