వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణీ మృతి
– నిండుప్రాణాలను బలికొన్న హాస్పిటల్
టీ మీడియా, ఫిబ్రవరి 4, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని బస్సు డిపో ముందర ఉన్న వెంకట సాయి ప్రవేట్ హాస్పిటల్ నందు శనివారం ఉదయం గర్భిణీ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే ఏదుల గ్రామానికి చెందిన స్వప్న భర్తతో హైద్రాబాద్లో నివాసం ఉంటున్నారు. ఇదివరకే ఇద్దరు పిల్లలకు జన్మ నిచ్చిన స్వప్న ప్రస్తుతం 4 నెలల గర్భంతో ఉంది. ప్రస్తుతం వారికి ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనందున, అభార్షన్ కోసం వెంకటసాయి ఆసుపత్రిలో చేరింది. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో వైద్యులు తనకు అభార్శన్ చేశారు. ఆపరేషన్ తరువాత 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండవలసిన స్వప్నను గాలికి వదిలి వైద్యుల పాపం ఆమె ప్రాణాలను బలి కొంది. ఉదయం 4 గంటలకు మరణించింది. ముందు నుంచే హాస్పిటల్ సిబ్బంది హాస్పిటల్ కి వచ్చే ప్రజల పైన నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం,
Also Read : ఫ్యాషన్ షో వేదిక వద్ద భారీ పేలుడు
పట్టించుకోకపోవడం డెలివరీ అయిన తర్వాత అవసరం ఉండి డెలివరీ సర్టిఫికెట్ కావాలి అని పోతే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం హాస్పిటల్ చుట్టూ తిప్పుకోవడం వారికి అలవాటయిపోయింది. సరైన పార్కింగ్ లేని కూర్చోవడానికి కూడా చోటు లేని ఈ హాస్పిటల్ ను వెంటనే స్థానిక వనపర్తి ఎమ్మెల్యే వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి , జిల్లా కలెక్టర్, డిఎంహెచ్ఓ స్పందించి వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేసి, వెంకటసాయి ఆసుపత్రిని లైసెన్సు రద్దు చేసి, శాశ్వతంగా ముయించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube