ఖరఫ్ కు యాక్షన్ ప్లాన్ సిద్ధం

ఖరఫ్ కు యాక్షన్ ప్లాన్ సిద్ధం

0
TMedia (Telugu News) :

ఖరఫ్ కు యాక్షన్ ప్లాన్ సిద్ధం
-7.03 లక్షల ఎకరాల్లో సాగు
-అందుభాటులో పత్తి విత్తనాలు
-నెల లో వేడి తగ్గాలి, తొందర వద్దు

-24న కలెక్టర్ సీడ్ డిస్టిబ్యూటర్స్, సెల్లర్లు మీటింగ్

-టి మీడియాతో జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల

టి మీడియా,మే21, ఖమ్మం : రానున్న ఖరీఫ్ కు యాక్షన్ ప్లాన్ సిద్ధంచేయడం తో పాటు, దాని అమలు చేస్తున్నామని జిల్లా వ్యవసాయ అధికారి ఎ.విజయ నిర్మల అన్నారు. టి మీడియా కి ఆమె ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు. సాగు చేసే విషయం లో రైతులు తొందర పాటు వద్దు, ఆందోళన చెందవద్దు అన్నారు. ఉన్నత అధికారుల సూచన మేరకు (జిల్లా కలెక్టర్ ఆదేశాలు) వ్యవసాయశాఖ అధికారులు,సిబ్బంది రైతులు కు ఏమి అవసరం అవి అందించడానికి సిద్ధంగా వున్నాము అన్నారు. ఈ నేల 24న తారీఖున కలెక్టర్ తో ప్రత్యేక సమావేశం విత్తనాలు గురించి ఏర్పాటు వున్నది.

dist agri officer khammam
dist agri officer khammam

ఇంటర్యూ ఇలా..

ప్ర :ఖరిఫ్ కు అంత సిద్ద మయ్యారా..?వివరాలు.?
జ :రానున్న ఖరీఫ్ లో 7.03లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసే అవకాశం ఉంది. దానికి తగ్గట్లు యాక్షన్ ప్లాన్ రూపొందించాము.అమలు పరుస్తాము.

ప్ర :ప్రధాన ఆహార, వాణిజ్య పంటలు సాగు పరిస్థితి ఏమిటి ?

జ :జిల్లాలో ప్రధాన ఆహర పంట వరి. 2.8లక్షల ఎకరాల వరకు సాగు చేసే అవకాశం ఉంది. ప్రధాన వాణిజ్య పంటలో మరొకటి ఒకటి పత్తి 2లక్షల వరకు సాగు చేసే అవకాశం ఉంది.

 ALSO Read:ఆపదలో అయ్యగారు ఆధుకోండి అంటూ వేడుకోలు

 

ప్ర :పత్తి విత్తనాలు సరిపోను నిలవ ఉన్నాయా..?

ప్ర : జిల్లాలో పత్తి సాగుకు 5.25 లక్ష ల ప్యాకెట్లు అవసరం అవసరము అవుతాయి . మొత్తం
సిద్దగా ఉన్నాయా?

జ : ఈ నేల 18వ తేదీ వరకు 1.80 లక్షల ప్యాకెట్లు స్టాక్ మా వద్ద అందుభాటు లో ఉన్నాయి.మిగిలినవి ట్రాన్స్ పోర్ట్ లో ఉన్నాయి. రెండు, మూడు రోజులలో మావద్దకు చేరుకుంట్టాయి. ఇబ్బంది లేదు.

ప్ర :నకిలీ విత్తన నిరోధక చర్యలు ఏమిటి ?

జ: మా యాక్షన్ ప్లాన్ లో మాకు వున్నది.రైతులు ఎవరు నకిలీ విత్తనాల భారిన పడవద్దు. అలాంటి సమాచారం ఉంటే మమ్ములను సంప్రదిచాలి. ఇప్పటి కె తనిఖీలు చేస్తున్నాము. ఇప్పటి వరకు నకిలి మరక మన జిల్లాకు అంటూ కోలేదు. పోలీస్ చర్యలు ఆరంభం అయ్యాయి. వారు అప్రమత్తంగా ఉన్నారు. ప్రతీ మండలంలో మేము పోలీస్ తో కలిపి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కు జిల్లా పోలీస్ కమిషనర్ కి లేటర్ కూడా రాసాము. ఈ నెల 24న జిల్లా కలెక్టర్ సీడ్ డిస్టిబ్యూటర్స్, సెల్లర్లు తో ప్రత్యేకంగా సమావేశం పెట్టారు. నకిలి విత్తనా లు,అధిక రేట్లు అమ్మ కం విషయం లో కఠినంగ్గా వ్యవహారిస్తాము.

ప్ర : రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు.పత్తి సాగు కు ఇప్పుడు అనుకూలమా ?

జ :రైతన్న లు తొంధర వద్దు.జులై 20వరకు పత్తి సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు వస్తున్నవి అకాల వర్షాలు మాత్రమే భూమి చల్ల బడాలి.వేడిగా ఉంది. ఇంకా రోహిణి కార్తె అయిపోలేదు. ఎండ కాలం పోలేదు. దుక్కి దున్నండి చాలు.విత్తనం ఇప్పుడే వేయకండి. మీరు ఇప్పుడే విత్తనాలు పెడితే కొన్ని మోలుస్తాయి. మరికొన్ని మొలవు. మొలిచిన మొక్కలు సరైన దిగుబడి ఇవ్వవు.సాగుకు 60 మిల్లి మీటర్ల వర్షం నమోదు కావాలి.

ప్ర :జీలుగు విత్త నాలు పరిస్థితి..?

జ: జీలుగు విత్తనాలు అన్ని స్థాయిలో అందుబాటు లో ఉంచాము. స్థానిక వ్యవసాయ అధికారులు ను సంప్రదించి తీసుకోండి,సాగు చేయండి. భూమికి భలం వస్తుంది. రసాయిన ఎరువుల ఖర్చు తగ్గు
తుందిని అన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube