ముంతాజ్ కు యోగ చార్య అవార్డ్ ప్రదానం
టీ మీడియా, మార్చ్ 7,కర్నూల్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగ రంగంలో విశేష సేవలను అందించిన కర్నూలు నగరానికి చెందిన యోగ శిక్షకులు, జిల్లా యోగ సంఘం వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ముంతాజ్ బేగంకి యోగచార్య అవార్డును మంగళవారం కర్నాటక రాష్ట్ర యోగాసన అసోసియేషన్ ప్రకటించింది. ముంతాజ్ బేగం యం ఎస్ సిలో యోగా చేశారు, యోగ, మెడిటేషన్ చేసి 2019లో న్యూఢిల్లీ హెచ్‌బియు యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. యోగ ఫెడరేషన్ ఆఫ్ ఇండియావారు నిర్వహించిన జాతీయ న్యాయ నిర్ణీతల పరీక్షలో 85 మార్కలు దేశంలోనే మొదటి ర్యాంక్ ను సాధించారు. డాక్టర్ ముంతాజ్ బేగంకు అవార్డు రావడం పట్ల రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, రాష్ట్ర యోగ సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి, జిల్లా యోగ అసోసియేషన్ సభ్యులు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.