వేములవాడ రాజన్న కు బంగారు రుద్రాక్షమాల

టీ మీడియా ,మార్చి 8 ,వేములవాడ

3
TMedia (Telugu News) :

వేములవాడ రాజన్న కు బంగారు రుద్రాక్షమాల

టీ మీడియా ,మార్చి 8 ,వేములవాడ:

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఎస్ ఎస్ ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధినేత, హిందూ మజ్దూర్ సంఘ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కానుగంటి రాజు మంగళవారం,వేములవాడ లో స్వయంభుగా వెలిసిన శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి మంగళవారం రోజు కుటుంబ సమేతంగా విచ్చేసి బంగారు రుద్రాక్ష మాల సమర్పించారు. సుమారు పదకొండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయానికి ఇప్పటివరకు ఎవరు స్వామివారికి రుద్రాక్ష మాల సమర్పించ లేదని ఆలయం ఈవో చెప్పడంతో స్పందించిన దాతలు స్వామివారికి చేయిస్తానని హామీ ఇచ్చారు.హామీ నిలబెట్టుకుని స్వామివారికి బంగారు రుద్రాక్ష మాల సమర్పించారు.

Also Read :  కానిస్టేబుల్ కి శ్రీమంతం.

స్వామి వారికి మాల సమర్పించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను అని రాజు అన్నారు. ఈ మాల తయారీకి నేపాల్ నుండి రుద్రాక్షలు చెప్పించి తయారు చేయించామని చెప్పారు.రుద్రాక్ష మాల తో పాటు అమ్మవారికి వజ్రపు ముక్కు పోగు , విఘ్నేశ్వరునికి వెండినామాలు , నంది గంట చేయించి దేవస్థానానికి అందజేయడం జరిగిందని రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో కానుగంటి రాజు ధర్మపత్ని చైతన్య , కుమారులు రాహుల్, శశాంక్ కోడలు భవిత , శోభారాణి ,ఏఈవో హరికిషన్ ,ఏ ఈ ఓ ప్రతాప నవీన్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీరాములు, వరి నర్సయ్య ,తమ్మల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube