మద్యం అధిక ధరలకు అమ్మితే సహించేది లేదు.

0
TMedia (Telugu News) :

– కాంగ్రెస్ పార్టీ పినపాక అధ్యక్షులు గోడిశాల రామనాథం .

టీ మీడియా, నవంబర్ 2 పినపాక .

పినపాక మండలం లో బెల్ట్ షాపులు ఎక్కువ గా నడుపుతున్నారని మద్యం దుకాణాల్లో అధిక ధరలుకు అమ్ముతున్నారు అని, కాంగ్రెస్ పార్టీ పినపాక అధ్యక్షుడు గొడిశాల రామనాథం అన్నారు. పినపాక మండలంలో బయ్యారం, ఎక్స్ రోడ్ బయ్యారం, జానంపేట గతంలో నడిపించిన బినామీ … ఒక ప్రముఖ వ్యక్తి గత రెండు సంవత్సరాలు గా అధికారుల కళ్లు కప్పి అధిక రేట్లకు విక్రయిస్తున్నాడని , సిండికేట్ అండదండలతో ఎమ్ఆర్పి రేటు పై అదనంగా 50 రూపాయలు వరకు తీసుకుంటూ మందు బాబుల రక్తాన్ని పిలుస్తున్నాడని 2021 డిసెంబర్ ఒకటో తారీకు నుండి కొత్త మద్యం షాపులపై అబ్కారి శాఖ అధికారులు, స్పెషల్ స్క్వాడ్ అధికారాలు తనిఖి చేసి మద్యం షాపులో ఎంఆర్పి రేట్ లకు అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎంఆర్పీ కి అమ్మ పోతే వారిపై తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరుతున్నదని, పినపాక మండలం లో రోజు రోజుకు బెల్టు షాపులు విచ్చలవిడిగా పెరుగు పోతున్నాయిని వీటి పై అబ్కారి శాఖ చర్యలు తీసుకోవాలని,

బెల్టుషాపులు వలన రాత్రి పగలు తేడా లేకుండా యువకులు త్రాగి రోడ్లపై బైకులు నడుపుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తు ప్రమాదాలు చేస్తున్నారని , అధికారులు చర్యలు చేపట్టకుంటే కాంగ్రెస్ పార్టీ మూకుమ్మడి ధర్నాలు రాస్తారోకోలు చేయవలసి వస్తుందని హెచ్చరించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube