ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 8 వనపర్తి : మద్యం డిపోలో హమాలి పోస్టులకు డిగ్రీలు, పీజీలు చదివిన పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవడం దురదృష్టకరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం అని ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు .ప్రభుత్వాలు తాత్కాలిక జనాకర్షణ పథకాలతో ఓటు బ్యాంక్ రాజకీయాలతో చదువుకున్న పట్టభద్రులను నిర్లక్ష్యం చేయడం వలన ఈ దారుణ పరిస్థితి ఏర్పడింది. దేశంలో రోజురోజుకు నిరుద్యోగ సమస్య పెరుగుతుంది లక్షలలో ఖాళీలు ఉన్న ప్రభుత్వాలు భర్తీ చేయకపోవడం వలన నిరుద్యోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. భవిష్యత్తులో పని దొరకని దేశంగా భారతదేశం అవతరించే పోతుందని అంతర్జాతీయ సమస్యలపై స్పందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం దారుణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టా పుచ్చుకున్న నిరుద్యోగులకు భరోసా కల్పించే పథకాలు చేపట్టాలని ప్రభుత్వ శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని ఈ సందర్భంగా కోరారు.

Vaccines in government departments should be filled.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube