విజయవాడ రాజ్ భవన్ కు రాష్ట్రపతి

రాష్ట్రపతి గౌరవార్ధం గవర్నర్ విందు

1
TMedia (Telugu News) :

విజయవాడ రాజ్ భవన్ కు రాష్ట్రపతి

-రాష్ట్రపతి గౌరవార్ధం గవర్నర్ విందు

టీ మీడియా,డిసెంబర్ 1,విజయవాడ : అధికారిక పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి మాననీయ ద్రౌపతి ముర్ము ఆదివారం విజయవాడ రాజ్ భవన్ కు విచ్చేయనున్నట్టు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు. రాష్ట్రపతి విజయవాడ ఆగమనం మొదలు విశాఖపట్నం పర్యటన వరకు గవర్నర్ అన్ని కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. రాష్ట్రపతి నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు డిల్లీ నుండి బయలు దేరి 10.15 గంటలకు విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుండి నేరుగా తాడిగడప పురపాలక సంఘం పరిధిలోని పోరంకి మురళి రిసార్టు లో (పోరంకి – నిడమానూరు రోడ్డు) రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పౌర సన్మానానికి ద్రౌపతి ముర్ము హాజరవుతారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన రాష్ట్రపతిని సన్మానిస్తారు. ఇక్కడ ప్రముఖులను మర్యాద పూర్వకంగా కలుస్తారు.

Also Read : జైలులో పెడతారా పెట్టుకోండి

అనంతరం రాజ్ భవన్ కు చేరుకుంటారు. రాష్ట్రపతి గౌరవార్ధం రాజ్ భవన్లో గవర్నర్ ఇచ్చే అధికారిక విందుకు ద్రౌపతి ముర్ము హాజరవుతారు. తదుపరి మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో బయలు దేరి ఇక్కడి నుండి విశాఖపట్నం నావల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడ జాతీయ రహదారుల సంస్ధ ఏర్పాటు చేసిన విభిన్న కార్యక్రమాలలో భాగంగా నూతన రహదారులకు ప్రారంభోత్సవాలు. శంఖుస్దాపనలు చేస్తారు. రాత్రికి అక్కడి నుండి నేరుగా తిరుపతి చేరుకుంటారు. సోమవారం ఉదయం తిరుమలలో స్వామివారి దర్శన అనంతరం, గోశాలను సందర్శిస్తారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్ధులతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. తిరుపతి నుండి మధ్యాహ్నం నేరుగా డిల్లీ పయనం అవుతారని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube