టీ మీడియా,డిసెంబర్ 7,పినపాక;
పినపాక ప్రెస్ క్లబ్ కార్యాలయం కోసం బయ్యారం క్రాస్ రోడ్ నందు స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ కు పినపాక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మ లింగారెడ్డి, ఉపాధ్యక్షులు బోడ లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి సంతోష్ వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… స్థానిక అధికారులతో సంప్రదించి అతి త్వరలోనే పినపాక ప్రెస్ క్లబ్ కు పరిష్కారం చూపుతామని సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు దొడ్డి శ్రీనివాసరావు, శ్రీరామ్ బృహస్పతి,నాంపల్లి విజయ్ కుమార్, కన్నె రమేష్, గుమాస్ శంకర్, సహాయ కార్యదర్శి నిట్ట వెంకటేశ్వర్లు,తోకల శంకర్, గొడిశాల చంద్రం, యాకన్న పాల్గొన్నారు.