వర్కింగ్ జర్నలిస్టులకు కూడా నవమి ప్రెస్ పాస్ లు ఇవ్వాలి : ప్రెస్ క్లబ్

వర్కింగ్ జర్నలిస్టులకు కూడా నవమి ప్రెస్ పాస్ లు ఇవ్వాలి : ప్రెస్ క్లబ్

1
TMedia (Telugu News) :

వర్కింగ్ జర్నలిస్టులకు కూడా నవమి ప్రెస్ పాస్ లు ఇవ్వాలి : ప్రెస్ క్లబ్
టీ మీడియా, ఏప్రిల్ 7, భద్రాచలం: శ్రీరామనవమి ప్రెస్ పాసులు అక్రిడేషన్ కార్డులు లేని వారికి కూడా ఇవ్వాలని ఎవరైతే వర్కింగ్ జర్నలిస్టుల గా ఉండి సంస్థ గుర్తింపు కార్డు ఉంటే కూడా వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రెస్ క్లబ్ ఆఫ్ భద్రాద్రి అధ్యక్షుడు తోటమళ్ళ బాలయోగి కోరారు. ఈ మేరకు భద్రాచలం ఏ.పి.ఆర్.ఓ కు వినతి పత్రం అందజేశారు.గత మూడేళ్లకు పైగా కొత్త అక్రిడేషన్ కార్డు ఇవ్వకపోవడం వల్ల ఆయా పత్రికల్లో, టీవీలలో నూతనంగా చేరిన జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు అందలేదని ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు. అదేవిధంగా చిన్న పత్రికల పాత్రికేయులకు కూడా వారి సంస్థ గుర్తింపు కార్డు తీసుకొని. నవమి పాసులు మంజూరు చేయాలని బాలయోగి సమాచార శాఖ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ భద్రాద్రి సెక్రటరీ రేపాక సాయి ఆఖిల్, గౌరవ సలహాదారులు వి ఎన్ ఎల్ నంద, సురేష్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube