ఇసుక లారీ ఓవర్ లోడ్లను,జీరో బిల్లు దందాలను అరికట్టాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్20,పినపాక:

పినపాక మండలంలోని గోవిందాపురంలో నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపులనుండి ఓవర్ లోడ్ వెళుతున్న ఇసుక లారీలను, అదేవిధంగా జీరాలు గా వెలుతున్న లారాలను అరికట్టాలని కాంగ్రెస్,బీజేపి మండల అధ్యక్షులు గొడిశాల రామనాదం,ధూళిపూడి శివ ప్రసాద్ లు
ఈ సందర్భంగా మాట్లాడుతూ…పినపాక మండల కేంద్రంలో గోవిందాపురం గ్రామంలో ఇసుక క్వారీల నుండి ప్రతిరోజు అధిక లోడుతో లారీలను నడపటం వలన రోడ్లు ధ్వంసం అయి,దీని వలన ప్రజలు ఇబ్బందులు పడుతూ ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు.
భద్రాద్రి పవర్ ప్లాంట్ కు,ఇతర చుట్టుపక్కల ప్రదేశాలకు ఏ బిల్లు లేకుండా ఆక్రమంగా,అదే విధంగా ఎన్ని జీరో బిల్లుల లారీలు నడుస్తున్నాయని,దీనివలన ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత అధికారులు స్పందించి గోవిందాపురం ఇసుక ర్యాంపు నుండి ఓవర్ లోడ్ లారీలను,జీరో లారీలను అరికట్టాలని డిమాండ్ చేశారు. స్పందించినట్లయితే కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామన్నారు.
ఈ సమావేశంలో బిజెపి ప్రధాన కార్యదర్శి పాటిబండ్ల శ్రీను వాసు,జిల్లా కిసాన్ మోర్తా ఉపాధ్యక్షులు పటేల్,వెంకట నారాయణ,మండల కార్యదర్శి,పూస దుర్గారావు,కొప్పుల ఉపెందర్,కాంగ్రెస్ మండల ప్రదాన కార్యదర్శి జక్కా వెంకటేశ్వర్లు,మైనార్షిసెల్ అధ్యక్షులు ఎస్ కె మదార్ సాహెబ్,మహిళా మండలి అధ్యక్షురాలు పాయం సమ్మక్క,కాంగ్రెస్ మండల కమిటి సభ్యుడు పూనెo వెరటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube