పత్తిని ఆశించే వైరస్ నివారణ చర్యలు చేపట్టాలి

వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త రుక్మిణి దేవి

0
TMedia (Telugu News) :

పత్తిని ఆశించే వైరస్ నివారణ చర్యలు చేపట్టాలి

–  వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త రుక్మిణి దేవి

టీ మీడియా, సెప్టెంబర్ 14, మధిర: ప్రతి పంటను ఆశిస్తున్న తంబకో స్ట్రీక్ వైరస్ పట్ల రైతుల అప్రమత్తంగా ఉండి నివారణ చర్యలు చేపట్టాలని మధిర వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రుక్మిణి దేవి సూచించారు. పత్తి పంటను ఆశిస్తున్న ఈ వైరస్ ప్రభావం ఎలా ఉంటుందనే విషయాలను తెలియజేస్తూ బుధవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ సీజన్ లో కురిసిన అత్యధిక వర్షాల కారణంగా వైరస్ వ్యాప్తి చెందుతుందని దీనిని నివారించేందుకు పత్తి పంటలో కలుపు మొక్కల నివారణ చర్యలు చేపట్టాలన్నారు ప్రధానంగా వయ్యారిభామ కలుపు మొక్కలు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుందన్నారు.

Also Read : నిరుపేద విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ

వైరస్ సోకిన మొక్కల ఆకులు పసుపు రంగుగా మారిపోవడంతో పాటు పూత పిందె రాలిపోతుందన్నారు. నివారణకు రైతులు సామూహిక కలుపు నివారణ చర్యల చేపట్టడంతో పాటు ఎకరాకు 15 నుండి 20 నీలం రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాకుండా తామర పురుగుల నివారణకు పిప్రోనిల్ రెండు మిల్లీలీటర్లు లేదా ఇమిదాక్లోప్రిడ్ 0.25 మిల్లి లీటర్లు లీటర్ నీటిలో కలిపి వారంలో రెండుసార్లు మార్చి మార్చి పిచికారి చేయాలన్నారు పై విధంగా వైరస్ నివారణ చర్యలు చేపట్టి రైతులు పత్తి పంటను కాపాడుకోవాలన్నారు. ప్రకటన చేసిన వారిలో శాస్త్రవేత్తలు వేణుగోపాల్ నాగ స్వాతి తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube