: ధ‌ర పెరిగినా త‌గ్గేదేలే అంటున్న జ‌నం

-11 నెల‌ల్లో బంగారం దిగుమ‌తి ఎంతో తెలుసా..?

1
TMedia (Telugu News) :

: ధ‌ర పెరిగినా త‌గ్గేదేలే అంటున్న జ‌నం.. -11 నెల‌ల్లో బంగారం దిగుమ‌తి ఎంతో తెలుసా..?టీ మీడియా,

 

మార్చి 7,హైదరాబాద్:బంగారం అంటే భార‌తీయ భామ‌ల‌కు ఎంతిష్ట‌మో చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇంత‌కుముందుతో పోలిస్తే ధ‌ర పెరిగినా పుత్త‌డి కొనుగోలు చేయ‌డానికే మొగ్గు చూపుతున్నారు. క‌రోనా నేప‌థ్యంలో 2020తో పోలిస్తే గ‌తేడాది దేశంలో వివాహాలు, శుభ‌కార్యాలు పెర‌గ‌డం కూడా బంగారానికి గిరాకీ ఏర్ప‌డ‌టానికి కార‌ణంగా క‌నిపిస్తున్న‌ది. ప్ర‌పంచంలోనే బంగారం దిగుమ‌తుల్లో మ‌న‌దేశం రెండో స్థానంలో నిలిచింది. ప‌సిడి దిగుమ‌తిలో తొలి స్థానంలో చైనా ఉంటుంది. మార్కెట్‌లో బంగారం ధ‌ర ( Gold Price ) పెరుగుతున్నా.. 2020-21తో పోలిస్తే 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రం ఏప్రిల్‌-ఫిబ్రవ‌రి మ‌ధ్య దిగుమ‌తులు 73 శాతం పెరిగి 45.1 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు దూసుకెళ్లాయి. ఫ‌లితంగా విదేశాల్లో వాణిజ్యంలో క‌రంట్ ఖాతా లోటు (క్యాడ్‌) పైపైకి దూసుకెళ్లింది. 2020 ఏప్రిల్‌- 2021 ఫిబ్ర‌వ‌రి మ‌ధ్య వాణిజ్య లోటు 89 బిలియ‌న్ డాల‌ర్ల‌యితే, 2021 ఏప్రిల్‌-2022 ఫిబ్ర‌వ‌రి మ‌ధ్య 176 బిలియ‌న్ డాల‌ర్ల వ‌ద్ద స్థిర ప‌డింది

also read:ఆస్ట్రేలియాలో ఘనంగా కవిత జన్మదిన వేడుకలు.
2020-21లో బంగారం దిగుమ‌తులు ఇలా
2020 ఏప్రిల్‌-2021 ఫిబ్ర‌వ‌రి మ‌ధ్య బంగారం దిగుమ‌తులు 26.11 బిలియ‌న్ డాల‌ర్లు మాత్ర‌మే. కానీ గ‌త నెల‌లో బంగారం దిగుమ‌తులు 11.45 శాతం త‌గ్గుముఖం ప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. కేంద్ర వాణిజ్య‌శాఖ గ‌ణాంకాల ప్ర‌కారం గ‌త‌నెల‌లో బంగారం దిగుమ‌తుల విలువ 4.7 బిలియ‌న్ డాల‌ర్లు మాత్ర‌మే.

also read:నాటు సారా స్థావరాలపై దాడులు

పెరిగిన జెమ్స్‌, ఆభ‌ర‌ణాల ఎగుమ‌తులు
అలాగే ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం తొలి తొమ్మిది నెల‌ల్లో జెమ్స్‌, ఆభ‌ర‌ణాల ఎగుమ‌తులు గ‌ణ‌నీయ స్థాయిలో పెరిగాయి. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంతో పోలిస్తే 57.5 శాతం పెరిగి 35.25 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకున్నాయి. అయితే, సెప్టెంబ‌ర్‌తో ముగిసిన త్రైమాసికంలో భార‌త్ క‌రంట్ ఖాతా లోటు (క్యాడ్‌) 9.6 బిలియ‌న్ల డాల‌ర్లు (1.3 శాతం) ప‌డిపోయాయ‌ని ఆర్బీఐ చెబుతున్న‌ది.

also read:కానిస్టేబుళ్లను సన్మానించిన ఏఎస్పీ
స‌గ‌టున బంగారం దిగుమ‌తులు త‌క్కువేనా
అయితే, ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో బంగారం దిగుమ‌తులు నెల‌వారీగా సాధార‌ణ స్థాయికంటే త‌క్కువ‌గా ఉన్నాయ‌ని జెమ్స్ అండ్ జ్యువెల్ల‌రీ ఎక్స్‌పోర్ట్స్ ప్ర‌మోష‌న్ కౌన్సిల్ (జీజేఈపీసీ) చైర్మ‌న్ కొలిన్ షా తెలిపారు. 2021 ఏప్రిల్‌-2022 ఫిబ్ర‌వ‌రి మ‌ధ్య స‌గటున ప్ర‌తి నెలా 76.57 ట‌న్నుల బంగారం దిగుమ‌తి అయ్యింద‌న్నారు. ఇది సాధార‌ణ స్థాయికి త‌క్కువేన‌న్నారు. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం తొలి 11 నెల‌ల్లో (ఏప్రిల్‌-ఫిబ్ర‌వ‌రి) బంగారం దిగుమ‌తులు 842.28 ట‌న్నులు.. కానీ సాధార‌ణంగా ఇదే పీరియ‌డ్‌లో ప్ర‌తిఏటా బంగారం దిగుమ‌తి 690-890 ట‌న్నుల మ‌ధ్య త‌చ్చాడుతుంద‌ని కొలిన్‌షా పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube