అంగన్వాడీ కేంద్రాలను ప్రైమరీ పాఠశాలలో విలీనం చేసే విధానాన్ని రద్దు చేయాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్ 01,కరకగూడెం;

జనసమూహంలో ఉండవలసిన అంగన్వాడీ కేంద్రాలను దూరంగా ఉన్నటువంటి పాఠశాలలో విలీనం చేసే విధానాన్ని రద్దు చేయాలని సిఐటియు నాయకులు సత్రపల్లి సాంబశివరావు డిమాండ్ చేశారు.
ఐసిడిఎస్ లక్ష్యానికి భిన్నమైనది ఐసిడిఎస్ నిర్వీర్యం చేసే కుట్ర ఇప్పటికే పౌష్టికాహారం రక్తహీనతలో మన దేశం ముందంజలో ఉందని,ఇలాంటి సమయంలో మెరుగైన సౌకర్యాలు అందించ వలసింది పోయి భారాల పేరుతో బాధ్యతలు మార్చడం అంగన్వాడి కేంద్రాల విలీనాన్ని తక్షణమే మానుకోవాలని ఆయన అన్నారు.కేంద్రం పెంచిన జీతాలు,పెండింగ్లో ఉన్నా టి ఏ డి ఏ లు గ్యాస్ బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కరకగూడెం,అనంతారం సెక్టార్ అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube